Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : గత మూడు ఐపీఎల్ సీజన్ల టాప్-5 బౌలర్లలో.. ముగ్గురు భారతీయులే!

Three of top five wicket takers in last three IPLs are Indian

ఐపీఎల్‌లో బ్యాటింగ్ ఎంత ముఖ్యమో, బౌలింగ్ కూడా అంతే ముఖ్యం. సరైన బౌలర్ జట్టులో ఉంటే అతనే కీలక సమయాల్లో జట్టును గెలిపిస్తాడు. అందుకే కొందరు స్టార్ బౌలర్లను కొనుగోలు చేసే సమయంలో ఫ్రాంచైజీలు అన్నీ చాలా గట్టిగా పోటీ పడతాయి. అయితే వాళ్లంతా అంత గొప్పగా రాణిస్తారా? అనేది పెద్ద ప్రశ్న. కొంత మంది బౌలర్లు మాత్రం తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడతారు.

గడిచిన మూడు ఐపీఎల్ సీజన్లలో హోం, ఎవే ఫార్మాట్ మ్యాచులు జరగలేదు. అయితే ఈసారి ఈ ఫార్మాట్ తిరిగొచ్చింది. దీంతో ఆయా జట్లలో బౌలర్లు కూడా మంచి హుషారు మీద ఉన్నారు. గత మూడు సీజన్లలో చెలరేగిన బౌలర్ల వివరాలు చూసుకుంటే.. టాప్ ఐదుగురు బౌలర్లలో ముగ్గురు భారతీయ బౌలర్లే ఉండటం గమనార్హం. కానీ టాప్ ప్లేస్‌లో మాత్రం సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ ఉన్నాడు. అతను గత మూడు సీజన్లలో 68 వికెట్లతో ఆకట్టుకున్నాడు.

గతేడాది కూడా రబాడ చక్కగా బౌలింగ్ చేశాడు. సీజన్ మొత్తం ఆడకపోయినా కూడా ఆడిన ప్రతి మ్యాచ్‌లో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించాడు. పవర్‌ప్లేతోపాటు డెత్ ఓవర్లలో కూడా కీలక వికెట్లు తీసుకున్నాడు. ఇక రెండో స్థానంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఉన్నాడు. అతను ఈ మూడు సీజన్లలో కలిపి 66 వికెట్లు తీసుకున్నాడు. గతేడాది కూడా రాణించిన అతను 27 వికెట్లతో పర్పుల్ క్యాప్ తన ఖాతాలో వేసుకున్నాడు.

భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా గత మూడు సీజన్లలో చెలరేగాడు. ఈ మూడు ఐపీఎల్స్‌లో కలిపి అతను 63 వికెట్లతో రాణించాడు. గతేడాది ఐపీఎల్‌లో బుమ్రా అంత గొప్పగా రాణించలేదు. కానీ మూడు సీజన్లలో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్లలో బుమ్రా మూడో స్థానంలో ఉన్నాడు. ఇక 59 వికెట్లతో మహమ్మద్ షమీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక చివరిగా ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 57 వికెట్లతో ఐదో స్థానంలో నిలిచాడు.

Story first published: Monday, March 27, 2023, 21:49 [IST]
Other articles published on Mar 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+