INDvsNZ: రెండో టీ20లో పాండ్యా చేసిన తప్పులు.. చివర్లో మాస్టర్ ప్లాన్‌తో గెలిచేశాడు!

ప్రపంచ నెంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ విశ్వరూపం చూపడంతో న్యూజిల్యాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. సూర్య అజేయ శతకంతో 191 పరుగులు చేసిన భారత్.. కివీ బ్యాటర్లను 126 పరుగులకే ఆలౌట్ చేసేసింది. ఆ జట్టులో కివీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (61) హాఫ్ సెంచరీ సాధించినా.. భారీ లక్ష్య ఛేదనలో అతను నెమ్మదిగా ఆడటంతో ఆ జట్టు విజయావకాశాలు దెబ్బతిన్నాయి.
ఈ మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. ఇలా భారీ విజయం సాధించినా కూడా టీమిండి ఈ మ్యాచులో రెండు పొరపాట్లు చేసింది. దాని వల్ల జరిగిన నష్టాన్ని ఒక మాస్టర్ స్ట్రాటజీతో పూడ్చుకొని ఘనవిజయం తన ఖాతాలో వేసుకుంది.

తొలి తప్పు టీం ఎంపిక
ఇప్పుడు టీమిండియా ఫోకస్ అంతా వచ్చే టీ20 వరల్డ్ కప్ కోసం జట్టును ఎలా తయారు చెయ్యాలా? అనే. అలాంటి సమయంలో భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్ వంటి సీనియర్ ఆటగాళ్లను జట్టులోకి తీసుకొని ఉమ్రాన్ మాలిక్ వంటి యువపేసర్‌ను పక్కన పెట్టడం అందరికీ షాకిచ్చింది.
అలాగే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌ను కాదని ఈ ఫార్మాట్‌లో పెద్దగా ఆకట్టుకోని రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌లకు అవకాశం ఇచ్చారు. వీళ్లిద్దరూ ఈ మ్యాచ్ పూర్తిగా విఫలమై జట్టులో సంజూ ఎంత ముఖ్యమో మరోసారి తేటతెల్లం చేశారు. ఇలా జట్టు కూర్పులో టీమిండియా పెద్ద పొరపాటే చేసింది.

రెండో తప్పు హార్దిక్ బ్యాటింగ్
దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ ఇద్దరూ బ్యాటింగ్ చేయగలరు కానీ.. ఫినిషర్లు కాదు. దినేష్ కార్తీక్ తర్వాత ఆ పాత్రను సమర్ధవంతంగా పోషించే ప్లేయర్ లేడనే మాట నిజమే కానీ.. ప్రస్తుతం జట్టులో ఫినిషర్‌గా ఉన్న బెస్ట్ ఆప్షన్ హార్దిక్ పాండ్యనే. కానీ అతను మాత్రం ఆ బాధ్యతను హుడా, సుందర్ భుజాలపై వేసేసి శ్రేయాస్ అవుటవగానే తను క్రీజులోకి వచ్చాడు. మొత్తం 13 బంతులు ఎదుర్కొన్నా కూడా ఒక్క బౌండరీ కూడా బాదలేకపోయాడు.

మాస్టర్ స్ట్రోక్ బౌలింగే..
టీమిండియాలో ఉన్న బౌలింగ్ ఆప్షన్లు అన్నింటినీ పాండ్యా ఉపయోగించుకున్నాడు. వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం దక్కని చాహల్, సిరాజ్‌లు ఈ మ్యాచ్‌లో సత్తా చాటారు. ఆ తర్వాత పార్ట్ టైమర్ హుడా కూడా అదరగొట్టాడు. వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్ కూడా ఆకట్టుకున్నారు. అర్షదీప్ కూడా బాగానే బౌలింగ్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో హార్దిక్ బౌలింగ్ చేయలేదు కానీ.. ఆరుగురు బౌలర్లు బౌలింగ్ చేశారు. వీరిలో ఐదుగురు వికెట్లు సాధించారు. గతంలో రోహిత్ కూడా ఆరో బౌలింగ్ ఆప్షన్ కావాలంటూ హుడాను జట్టులోకి తీసుకున్నాడు. కానీ అతనితో బౌలింగ్ వెయ్యనివ్వలేదు. ఈ పొరపాటు చెయ్యని పాండ్యా.. హుడా సహా తన వద్ద ఉన్న బౌలింగ్ వనరులు అన్నింటినీ చాలా చక్కగా ఉపయోగించుకుని అద్భుతమైన విజయం సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications