For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023 : సన్‌రైజర్స్ ప్రధాన సమస్యలివే.. కావ్య పాప ఏం చేస్తుందో?

 Three major Issues before Sunrisers Hyderabad before MIni Auction

ఐపీఎల్ మినీ వేలానికి రోజులు దగ్గర పడుతున్నాయి. ఇలాంటి సమయంలో అన్ని జట్లు తాము ఎవరి కోసం ఎక్కువ ఖర్చు పెట్టాలో లెక్కలు వేసుకుంటున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా ఇదే పని చేస్తోంది. అయితే మిగతా జట్లు అన్నింటికన్నా ఎక్కువ డబ్బు సన్‌రైజర్స్ వద్ద ఉండటం గమనార్హం. మొత్తం రూ.42 కోట్లపైగా పర్స్ వాల్యూలో సన్‌రైజర్స్ వేలానికి వెళ్తోంది. అయితే ఈ జట్టు ముందు మూడుప్రధాన సమస్యలు ఉన్నాయి.

 సరైన స్పిన్నర్ కొరత

సరైన స్పిన్నర్ కొరత

సన్‌రైజర్స్ జట్టు వద్ద సరైన స్పిన్నర్ లేని లోటు గతేడాది కొట్టొచ్చినట్లు కనిపించింది. రషీద్ ఖాన్‌ను మెగా వేలానికి ముందు వదిలేయడం ఎంత పెద్ద తప్పో తెలిసొచ్చింది. సన్‌రైజర్స్ పేస్ బలం మంచి బలంగా ఉన్నప్పటికీ నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడంతో మిడిల్ ఓవర్లలో ఆ జట్టు ఇబ్బందులు పడింది. ఉన్న ఒకే ఒక స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ గాయాలపాలవడం ఆ జట్టుకు మరింత తలనొప్పిగా మారింది. మరి ఈ వేలంలో అయినా ఆడమ్ జంపా వంటి స్పిన్నర్ ఎవర్నయినా కొనుగోలు చేసి ఆ లోటు పూడ్చుకుంటుందేమో చూడాలి.

 ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కూడా..

ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కూడా..

ఐపీఎల్‌లో అత్యుత్తమ పేస్ బ్యాటరీ ఉన్న జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి. భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ ముగ్గురూ రాణిస్తున్నారు. అలాగే సౌతాఫ్రికా యువ పేసర్ మార్కో జాన్సెన్ కూడా అడపా దడపా మెరిశాడు. అయితే ఈ జట్టు వద్ద ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లేకపోవడం ఇబ్బందిగా మారింది. సన్‌రైజర్స్ గెలవాలన్నా ఓడాలన్నా కేవలం టాపార్డర్, మిడిలార్డర్‌దే బాధ్యతగా ఉంది. ఎందుకంటే లోయర్ ఆర్డర్‌లో ఆదుకునే ఒక్క పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కూడా లేడు. ఈ వేలంలో అయినా కావ్య పాప ఈ లోటును భర్తీ చేస్తుందేమో చూడాలి.

 తర్వాతి కెప్టెన్ ఎక్కడ?

తర్వాతి కెప్టెన్ ఎక్కడ?

డేవిడ్ వార్నర్‌ను అర్ధంతరంగా జట్టు నుంచి తప్పించినప్పుడు సన్‌రైజర్స్ వద్ద కేన్ విలియమ్సన్ రూపంలో కెప్టెన్సీ ప్రత్యామ్నాయం ఉంది. కానీ ఇప్పుడు కేన్ మామను వదులుకున్న తర్వాత ఈ జట్టు చుక్కాని లేని పడవలా మారింది. ప్రస్తుతం జట్టులో ఉన్న ఒక్క ఆటగాడు కూడా కెప్టెన్సీ నైపుణ్యాలు ఉన్నవాడు కాదు. దీంతో కచ్చితంగా కొత్త కెప్టెన్ కోసం వేలంలో పోటీ పడక తప్పనిసరి పరిస్థితి. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కోసం గట్టిగా పోటీ పడాలని కావ్య పాప భావిస్తోందట. తద్వారా ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సమస్యతోపాటు కెప్టెన్సీ సమస్యకు కూడా ఫుల్‌స్టాప్ పెట్టాలని అనుకుంటోందట.

Story first published: Saturday, December 17, 2022, 15:38 [IST]
Other articles published on Dec 17, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+