భారత భవిష్యత్ క్రికెట్‌ను బలోపేతం చేయడానికి బీసీసీఐ చర్యలు మొదలుపెట్టింది. టీ20 ఫార్మాట్‌కు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా గుడ్‌బై పలకడంతో.. వాళ్ల వారసులను సిద్ధం చేయడానికి యాక్షన్ షురూ చేసింది. ఈ నేపథ్యంలో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని యువ జట్టును జింబాబ్వే పర్యటనకు పంపింది. ఇవాళ నుంచి జింబాబ్వేతో భారత్ అయిదు టీ20 సిరీస్ ఆడనుంది.
హరారే వేదికగా శనివారం సాయంత్రం 4.30 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా, ఈ సిరీస్‌తో భారత క్రికెట్‌లో కొత్త తరానికి నాంది పలకనుంది. ఈ క్రమంలో మొదటి మ్యాచ్‌లో ముగ్గురు ఐపీఎల్ స్టార్లు అరంగేట్రం చేయనున్నట్లు తెలస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నాడని ఇప్పటికే నయా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అధికారికంగా ప్రకటించాడు.

ఐపీఎల్-2024లో అభిషేక్ సంచలన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. 16 మ్యాచ్‌ల్లో 32 సగటు, 200+ స్ట్రైక్‌రేటుతో 484 పరుగులు చేశాడు. పిచ్, ప్రత్యర్థితో సంబంధం లేకుండా పవర్‌ప్లేలోనే మ్యాచ్ గమనాన్ని మార్చే సత్తా అభిషేక్ సొంతం. అంతేగాక స్పిన్ బాధ్యతలు కూడా నిర్వర్తించగలడు. దీంతో 23 ఏళ్ల ఈ కుర్రాడు ఇవాళ టీమిండియా జెర్సీ ధరించే అవకాశాన్ని పొందాడు. అభిషేక్‌తో పాటు బ్యాటర్ రియాన్ పరాగ్ కూడా అరంగేట్రం చేయనున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న పరాగ్ గత సీజన్‌లో పరుగుల వీరుల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. 14 ఇన్నింగ్స్‌ల్లో 52 సగటు, 149 స్ట్రైక్‌రేటుతో 573 పరుగులు చేశాడు. నాలుగో స్థానంలో వస్తూ భారీ స్కోర్లు సాధించే సత్తా ఉన్న పరాగ్ వయస్సు 22 ఏళ్లు. ఇక సీఎస్కే ప్రధాన బౌలర్ తుషార్ దేశ్‌పాండే కూడా ఇవాళ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌తో పాటు తుషార్ దేశవాళీ క్రికెట్‌లోనూ సత్తాచాటాడు. గత ఐపీఎల్‌లో 17 వికెట్లు తీశాడు.
జింబాబ్వేతో తొలి టీ20కి భారత తుది జట్టు(అంచనా)
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, ముకేశ్ కుమార్.
జింబాబ్వే పర్యటనకు ఎంపికైన భారత జట్టు:
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్, జితేశ్ శర్మ, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, సాయి సుదర్శన్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండే.