Team India: ఈ ముగ్గురూ మరో టీ20 ప్రపంచకప్ ఆడరు.. టికెట్ కన్ఫర్మ్ అయిపోయిన ప్లేయర్స్ వీళ్లే!

ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌ను ఘనంగా ప్రారంభించిన భారత జట్టు.. సెమీఫైనల్‌లో ఘోరంగా ఓడి ఇంటి దారి పట్టింది. భారత జట్టులో పలువురు సీనియర్ ప్లేయర్లు ఉన్నారు.
వీరిలో కొంతమందికి ఇదే చివరి టీ20 ప్రపంచకప్ అనేది జగమెరిగిన సత్యం. అలాంటి వారిలో దాదాపుగా టికెట్ కన్ఫర్మ్ అయిపోయిన ఆటగాళ్లు ముగ్గురున్నారు. వాళ్ల వివరాలు ఒకసారి పరిశీలిస్తే..

దినేష్ కార్తీక్
అసలు భారత జట్టులో ఉంటాడనే ఎవరూ ఊహించని ప్లేయర్ డీకే. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించి టీమిండియాలో పునరాగమనం చేశాడీ వెటరన్ ప్లేయర్. 37 ఏళ్ల వయసులో భారత జట్టులోకి పునరాగమనం చేసిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు.. ప్రపంచకప్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడే అవకాశమే రాలేదు. సఫారీలతో జరిగిన మ్యాచ్‌లో దక్కిన ఛాన్స్‌ను అతను ఉపయోగించుకోలేకపోయాడు. న్యూజిల్యాండ్‌తో సిరీస్‌కు అతన్ని పక్కన పెట్టిన సెలెక్టర్లు.. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో అవకాశం ఇస్తారని అనుకోవడం కల్లే.

రవిచంద్రన్ అశ్విన్
ఈ ప్రపంచకప్‌లో అత్యంత తీవ్రంగా నిరాశ పరిచిన వెటరన్ ప్లేయర్ అశ్విన్. ఆస్ట్రేలియా పిచ్‌లు పేసర్లకు అనుకూలించినా.. కొంతమంది స్పిన్నర్లు కూడా రాణించారు. దీంతో అశ్విన్‌పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అశ్విన్ వాళ్లందర్ని మోసం చేశాడు. భారత జట్టు ఈ టోర్నీలో ఎదుర్కొన్న బలమైన జట్లు పాకిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌తో మ్యాచుల్లో మొత్తం 9 ఓవర్లు వేసిన అతను.. 93 పరుగులు ఇచ్చి కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్నాడు. అతన్ని కూడా కివీస్‌తో సిరీస్‌కు బీసీసీఐ పక్కన పెట్టింది.

మహమ్మద్ షమీ
భారత జట్టులో కీలక పేసర్లకు గాయాలవడం, ఆసియా కప్‌లో యువ బౌలర్లు తేలిపోవడంతో సడెన్‌గా ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించాడు మహమ్మద్ షమీ. సుమారు ఏడాదిగా కేవలం వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడిన అతను.. ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఒక్క ఓవర్ మాత్రమే వేసినా నాలుగు వికెట్లతో చెలరేగాడు. కానీ అసలు టోర్నీలో మాత్రం తేలిపోయాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఏమాత్రం ఆకట్టుకోలేదు. దీంతో అతన్ని పక్కనపెట్టేసి పొట్టి ఫార్మాట్‌లో యువ పేసర్లకు జట్టులో అవకాశం కల్పించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications