Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KL Rahul: రాహుల్‌ను రిప్లేస్ చేసి.. జట్టును గెలిపించగల యువ ఓపెనర్లు వీళ్లే!

Three Indian players who can replace KL Rahul going forward

ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఓటమికి ప్రధాన కారణం ఓపెనర్ల వైఫల్యమే. ద్రావిడ్, రోహిత్ జోడీ జట్టు కోసం కొత్త టెంప్లేట్ రూపొందించి, పవర్‌ప్లేలో ధనాధన్ ఓపెనింగ్స్ ఇవ్వాలని నిర్ణయించింది. కేఎల్ రాహుల్ పునరాగమనం వరకే ఆ మాటలు సాగాయి. రాహుల్ వచ్చిన తర్వాత మళ్లీ పాత పద్ధతిలోకి మారిపోయింది. నిదానమైన ఆరంభాలతోపాటు రాహుల్, రోహిత్ ఇద్దరూ సరిగా ఆడకపోవడంతో జట్టు ప్రపంచకప్‌లో పూర్తిగా నష్టపోయింది. ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్‌లో రాహుల్‌ను పక్కన పెట్టేయాలని డిమాండ్లు వస్తున్నాయి. అదే జరిగితే అతని స్థానాన్ని భర్తీ చేయగలిగే ముగ్గురు యువప్లేయర్లపై ఒక లుక్కేద్దామా..

 రిషభ్ పంత్

రిషభ్ పంత్

పొట్టి ఫార్మాట్‌లో పెద్దగా రాణించలేదంటూ పంత్‌పై విమర్శలు ఉన్నాయి. యాభైపైగా టీ20 మ్యాచులు ఆడినా కూడా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు పెద్దగా లేవు. దీంతో అతనికి ఓపెనర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. అండర్-19 జట్టులో ఓపెనర్‌గా రాణించిన అతను రాహుల్‌తో పోల్చుకుంటే భారత జట్టుకు కూడా మెరుగైన ఆరంభాలే అందించాడు. ఈ స్థానంలో కుదురుకుంటే పంత్ కచ్చితంగా జట్టుకు మంచి ఓపెనర్ దొరికినట్లే.

పృథ్వీ షా

పృథ్వీ షా

సెహ్వాగ్ తర్వాత అంత విధ్వంసకరమైన ఓపెనింగ్ అందించగల బ్యాటర్ ఎవరైనా ఉన్నారంటే అది పృథ్వీ షానే అని చెప్పాలి. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో విధ్వంసం సృష్టించిన షా.. 181.42 స్ట్రైక్ రేట్‌తో 332 పరుగులు చేశాడు. దీంతో అతన్ని కచ్చితంగా ప్రపంచకప్ జట్టులోకి తీసుకుంటారని అంతా అనుకున్నారు. అయితే రాహుల్‌పై నమ్మకం ఉంచిన సెలక్టర్లు షాకు హ్యాండిచ్చారు. అదెంత పెద్ద తప్పో ఇప్పుడు తెలిసొచ్చింది.

సంజూ శాంసన్

సంజూ శాంసన్

ఒక ఓపెనర్.. మంచి వికెట్ కీపర్.. అద్భుతమైన ఫినీషర్ వీల్లందరినీ కలిపితే సంజూ శాంసన్. నిలకడ లేదని తనపై ఉన్న విమర్శలకు ఈ ఏడాది శాంసన్ సరైన సమాధానం ఇచ్చాడు. తనకు దక్కిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుని దాదాపు అన్ని మ్యాచుల్లోనూ రాణించాడు. జట్టులో ఏ స్థానంలోనైనా ఆడగలిగే శాంసన్ టీ20ల్లో కొత్త టెంప్లేట్‌కు పూర్తిగా న్యాయం చేయగలడు. రాహుల్‌లా నిదానంగా ఇన్నింగ్స్ ఆరంభించకుండా ఎంతటి బౌలింగ్‌ యూనిట్‌కైనా బౌండరీలతో ముచ్చెమటలు పట్టించే సత్తా ఉన్న ఆటగాడు శాంసన్. ఈ ముగ్గురిలో ఎవరైనా సరే వచ్చే టీ20 ప్రపంచ కప్ నాటికి పొట్టి ఫార్మాట్‌లో రాహుల్‌ను రీప్లేస్ చేసి జట్టును ఒంటి చేత్తో గెలిపించగల సమర్థులే.

Story first published: Saturday, November 12, 2022, 15:27 [IST]
Other articles published on Nov 12, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+