
హైదరాబాద్: ఐపీఎల్ కోసం భారీ సంఖ్యలో వీక్షకులను టార్గెట్ చేసుకుని స్టార్ నెట్‌వర్క్ కొత్త ప్రణాళికలను రూపొందించనుంది. రూ.16,347.5కోట్ల విలువ మేరకు ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. ఐపీఎల్ ను పురస్కరించుకొని ఇటీవల ప్రమోషనల్ సాంగ్ ను సైతం విడుదల చేయగా అంతగా అందరినీ ఆకర్షించలేకపోయింది.
కామెంటేటర్ల విషయానికొస్తే.. సుమారు 100మంది కామెంటేటర్లతో ప్రజలముందుకు రానుంది. 50రోజుల పాటు జరగనున్న ఈ లీగ్‌కు వీక్షకులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు ఆరు భాషల్లో కామెంటేటర్లు అందుబాటులో ఉండనున్నారు. ఇందుకుగాను 10 నెట్‌వర్క్‌లతో అనుసంధానమై ఏర్పాట్లు ముమ్మరంగా సాగిస్తోంది స్టార్ నెట్‌వర్క్.
అంతర్జాతీయ మ్యాచ్‌లకు వ్యాఖ్యానం చేస్తోన్న 24 మంది కామెంటేటర్లు ఐపీఎల్‌లో కనిపించనున్నారు. ఇందులో మహిళా కామెంటేటర్లు సైతం ఉన్నారు. వీరిలో కేవలం ఇంగ్లీషు కామెంటేటర్లు ఆరుగురు మాత్రమే.
మాజీ క్రికెటర్లతో పాటు క్రికెట్ ఆడని వాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. స్టార్ స్పోర్ట్స్ ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీ 700మిలియన్ల మందికి చేరువ చేయాలన్న లక్ష్యంతో పని చేస్తోంది. క్రికెట్‌కు సంబంధం లేని వాళ్లను కామెంటేటర్లగా ఎంచుకున్న స్టార్ స్పోర్ట్స్ ఇప్పటికే వారికి ముంబైలో శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం.
ఐపీఎల్‌లో పాల్గొన్న అంతర్జాతీయ కామెంటేటర్ల వివరాలిలా..
సునీల్ గవాస్కర్
సంజయ్ మంజ్రేకర్
మురళీ కార్తీక్
ఎల్ శిశరామకృష్ణన్
బ్రెట్ లీ
మాథ్యూ హేడెన్
మైఖేల్ క్లార్క్
డీన్ జోన్స్
సీమన్ డ్యుయోల్
స్కాట్ స్టైరిస్
డేనీ మోర్రీసన్
అయాన్ బిషప్
పొమ్మి బాంగా
మహిళా కామెంటేటర్లు:
లీసా స్తాలేకర్
మెలనీ జోన్స్
అంజుమ్ చోప్రా
ఇసా గుహ
హర్షా బోగ్లే