ఇంగ్లాండ్ చేతిలో ఓటమి ఎఫెక్ట్: పాక్ వరల్డ్‌కప్ జట్టులో మూడు మార్పులు

హైదరాబాద్: వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేసిన పాకిస్థాన్ జట్టులో మార్పులు చోటు చేసుకోనున్నాయా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఇంజిమాముల్ హక్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ... జట్టు మేనేజ్‌మెంట్‌తో చర్చించి మూడు మార్పులను సూచించినట్లుగా తెలుస్తోంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో ఆదివారంతో ముగిసిన ఐదు వన్డేల సిరిస్‌ను 4-0తో చేజార్చుకుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు అయింది. ఈ వన్డే సిరిస్‌లో పాక్ పేలవ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న సెలక్టర్లు, జట్టు మేనేజ్‌మెంట్ పలు మార్పులకు శ్రీకారం చుట్టారు.

ఓపెనర్ అబిద్ అలీపై వేటు
ఇందులో భాగంగా పాకిస్థాన్ ఓపెనర్ అబిద్ అలీతో పాటు ఆల్ రౌండర్ ఫహీమ్ ఆప్రఫ్, పేసర్ జునైద్ ఖాన్‌లను స్వదేశానికి పంపించాలని జట్టు మేనేజ్ మెంట్ నిర్ణయం తీసుకుంది. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఆఖరి వన్డేలో తుది జట్టులో చోటు దక్కించుకున్న ఓపెనర్ అబిద్ అలీ (5) పరుగులు చేసి నిరాశపరిచాడు.

స్వదేశానికి తిరుగు పయనం
ఆల్ రౌండర్ ఫహీమ్ ఆప్రఫ్ ఈ సిరిస్ మొత్తం పేలవ ప్రదర్శన కనబరిచాడు. పేసర్ జునైద్ ఖాన్ కూడా ఆశించిన స్థాయిలో ఈ సిరిస్‌లో రాణించలేకపోయాడు. దీంతో ఈ ముగ్గురిని స్వదేశానికి తిరిగి పంపించాలని అటు సెలక్టర్లు, ఇటు జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అమీర్, అసిఫ్ అలీకి గ్రీన్ సిగ్నల్
ఈ ముగ్గురి స్థానంలో వరల్డ్‌కప్ జట్టులో వెటరన్ పేసర్ మహ్మద్ అమీర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అసిఫ్ అలీ(ఐదు వన్డేల సిరిస్‌లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు)లతో భర్తీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక, మూడో స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. ఈ స్థానం కోసం వాహర్ రియాజ్, ఉస్మాన్ ఖాన్ మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది.

మే31న తొలి మ్యాచ్ విండిస్‌తో
మే20న(సోమవారం) లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఇంజిమాముల్ హక్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ వరల్డ్‌కప్‌లో ఆడే 15 మందితో కూడిన పాకిస్థాన్ జట్టుని ప్రకటించనుంది. మే30న ఆరంభమయ్యే ఈ మెగా టోర్నీలో భాగంగా పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌ని మే31న వెస్టిండిస్‌తో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications