న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గ్యాలరీలు వెలవెల!: చారిత్రాత్మక టెస్టుపై ఆసక్తి చూపని అభిమానులు

By Nageshwara Rao
India vs England : Cricket Fans Shows No Intrest On the Match
Thousands of empty seats expected for Englands first Test against India

హైదరాబాద్: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ టెస్టు సిరిస్‌కు భారత జట్టు సిద్ధమవుతోంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య బుధవారం (ఆగస్టు 1) నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్టు ఆతిథ్య ఇంగ్లాండ్‌కు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఇంగ్లాండ్‌కు ఇది 1000వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం.

ఇందుకు తగినట్లుగా ఇప్పటికే స్టేడియం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఇంగ్లీషు క్రికెట్ అభిమానులు మాత్రం ఈ చారిత్రాత్మక టెస్టు మ్యాచ్‌పై పెద్దగా ఆసక్తి చూపడం లేదంట. తొలి టెస్టు మ్యాచ్ జరిగే ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో వేల కొద్దీ టిక్కెట్లు కూడా అమ్ముడుపోవడం లేదంట.

ఈ విషయాన్ని స్టేడియం నిర్వహాకులే వెల్లడించారు. "వారం మధ్యలో టెస్టు ప్రారంభంకానుండటంతో మొదటి రెండు రోజులు అంటే బుధ, గురు వారాల్లో కనీసం పదివేల సీట్లు ఖాళీగా కనిపించనున్నాయి. సెప్టెంబరులో భారత్‌ ఆసియా కప్‌ ఆడాల్సి రావడంతో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లోని మ్యాచ్‌లను త్వరగా నిర్వహిస్తున్నారు" అని తెలిపారు.

"దీంతో వారం మధ్యలో మ్యాచ్‌లు ప్రారంభించాల్సి వచ్చింది. ఫలితంగా ప్రేక్షకాదరణ తగ్గింది. మూడో టెస్టు శనివారం, ఐదో టెస్టు శుక్రవారం ప్రారంభమవుతున్నాయి. బుధవారం మ్యాచ్‌ ప్రారంభించడం వల్ల చాలా నష్టపోతున్నాం. సాధారణంగా ఇంగ్లాండ్‌లో గురువారం టెస్టు మ్యాచ్‌ను ప్రారంభిస్తాం" అని స్టేడియం నిర్వాహుకలు అన్నారు.

"అప్పుడు అభిమానులు కూడా మైదానానికి తరలివచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భారత్‌-ఇంగ్లాడ్‌ టెస్టు సిరీస్‌ షెడ్యూల్‌ పట్ల చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. ఐదు రోజుల పాటు జరిగే తొలి టెస్టుకు ఇప్పటి వరకు 70వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. మేము ఊహించినంత స్పందన మాత్రం లేదు" అని పేర్కొన్నారు.

జట్ల వివరాలు:

ఇండియా:
Virat Kohli (c), Shikhar Dhawan, Murali Vijay, KL Rahul, Cheteshwar Pujara, Ajinkya Rahane, Dinesh Karthik (wk), Rishabh Pant, Karun Nair, Hardik Pandya, R Ashwin, Ravindra Jadeja, Kuldeep Yadav, Ishant Sharma, Umesh Yadav, Shardul Thakur, Mohammed Shami, Jasprit Bumrah.

ఇంగ్లాండ్:
Joe Root (c), Alastair Cook, Keaton Jennings, Jonny Bairstow, Jos Buttler, Ben Stokes, Dawid Malan, Moeen Ali, Adil Rashid, Jamie Porter, Sam Curran, James Anderson, Stuart Broad.

ఐదు టెస్టులు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచి ప్రారంభమవుతాయి.

Story first published: Tuesday, July 31, 2018, 19:07 [IST]
Other articles published on Jul 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X