డేవిడ్ వార్నర్ సెంచరీ వెనుక ఎవరున్నారో తెలుసా?

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో డేవిడ్ వార్నర్ ఆటను చూస్తుంటే తనను తాను నిరూపించుకోవాలని ఉన్నట్లుంది. బాల్ టాంపరింగ్ ఉదంతం కారణంగా డేవిడ్ వార్నర్ సంపాదించిన పేరు ప్రఖ్యాతులు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. ఈ ఉదంతంలో కెప్టెన్ స్టీవ్ స్మిత్ కంటే కూడా వార్నరే ఎక్కువ ఫోకస్ అయ్యాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

బాల్ టాంపరింగ్ కారణంగా
బాల్ టాంపరింగ్ కారణంగా స్టీవ్ స్మిత్‌తో పాటు వార్నర్ కూడా ఏడాది కాలం పాటు ఆసీస్ జట్టుకు దూరం అయ్యాడు. క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన నిషేధం ముగిసిన తర్వాత పునరాగమనం చేసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 12వ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసే ఆటగాడికిచ్చే ఆరెంజ్ క్యాప్‌ని సొంతం చేసుకున్నాడు.

ఆస్ట్రేలియా జట్టు విజయాల్లో కీలకపాత్ర
ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లోనూ ఆస్ట్రేలియా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. తాజాగా బుధవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. వన్డేల్లో వార్నర్‌కి ఇది 15వ సెంచరీ. ఈ క్రమంలో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 15 సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో వార్నర్ చోటు దక్కించుకున్నాడు.

108 ఇన్నింగ్స్‌లో 15 సెంచరీలు సాధించి
108 ఇన్నింగ్స్‌లో 15 సెంచరీలు సాధించి.. వార్నర్ రికార్డు సృష్టించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా తనపై నిషేధం విధించిన తర్వాత వార్నర్ మొదట్లో నిర్వేదానికి గురయ్యాడు. మళ్లీ తాను ఆస్ట్రేలియా జట్టుకు ఆడుతానో లేదో అన్న సందేహాన్ని కూడా వెలిబుచ్చాడు. అయితే, తన భార్య క్యాండిస్ ప్రోత్సాహం వల్లే మళ్లీ ఆటగాడిగా రాణించినట్లు డేవిడ్ వార్నర్ చెప్పాడు.
డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ
ఈ సందర్భంగా వార్నర్ మాట్లాడుతూ "నిషేధ సమయంలో కుటుంబం నుంచి మంచి మద్దతు లభించింది. మానసికంగా బలహీనపడ్డ తనకు క్యాండిస్ శక్తినిచ్చినిచ్చింది" అని డేవిడ్ వార్నర్ చెప్పాడు. అన్ని ఫార్మాట్లకు తగ్గట్లుగా తనను తీర్చిదిద్దిందని వార్నర్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications