
వరల్డ్‌కప్‌లో భారత్‌కు ధోని సేవలు అవసరం
ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న 2019 వరల్డ్‌కప్‌లో భారత్‌కు అతడి సేవలు అవసరమని వార్న్ అభిప్రాయపడ్డాడు. "ధోని గొప్ప ఆటగాడు. జట్టు అవసరాల రీత్యా అతడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. ఎలాంటి స్థితికైనా అతడు తనను తాను బాగా అన్వయించుకుంటాడు. ధోనీని విమర్శించే వాళ్లకు.. వాళ్లేమి మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియదు" అని అన్నాడు.

నాలుగో వన్డేలో ధోని లేని లోటు స్పష్టంగా
"వరల్డ్‌కప్‌లో భారత్‌కు అతడు అవసరం. అతడి అనుభవం, మైదానంలో కోహ్లీకి సహకరించడానికి అతడి నాయకత్వ నైపుణ్యం జట్టుకు అవసరం" అని అన్నాడు. ఆసీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో ధోని లేని లోటు స్పష్టంగా కనిపించిందన్న వార్న్.. మూడు వందలకు పైగా పరుగులు లక్ష్యాన్ని కూడా టీమిండియా కాపాడుకోలేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

వికెట్ల వెనుకాలా ఉండి ప్రశాంతంగా ధోని రచించే వ్యూహాలు
రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, చాహల్ వంటి యువ ఆటగాళ్లు చేసిన పొరపాట్ల నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలని వార్న్ ఈ సందర్భంగా సూచించాడు. నాలుగో వన్డేలో వికెట్ల వెనుకాలా ఉండి ప్రశాంతంగా ధోని రచించే వ్యూహాలు మిస్సయ్యాయని, కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ధోని సూచనలు లేక అయోమయానికి గురయ్యాడని వార్న్ పేర్కొన్నాడు.

ధోని అనుభవం కోహ్లీకి అవసరం
కోహ్లీ మంచి కెప్టెనే అయినప్పటికీ... ఒత్తిడిలో ఉన్నప్పుడు ధోని అనుభవం అతడికి అవసరమని వార్న్ అన్నాడు. ఇక, ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారని కొనియాడాడు. వరల్డ్‌కప్ వరకు పాత ఆసీస్ జట్టు ఆటను చూడవచ్చని... ఇదే ఆటను కొనసాగిస్తే ప్రపంచకప్ గెలిచే అవకాశాలు ఆసీస్‌కు పుష్కలంగా ఉన్నాయన్నాడు. అయితే ఇప్పటికీ భారత్, ఇంగ్లండ్ జట్లు మాత్రమే ప్రపంచకప్‌లో ఫేవరెట్లుగా ప్రపంచకప్‌లో అడుగుపెడుతున్నాయని వార్న్ చెప్పాడు. అయితే, ఆస్ట్రేలియా మాత్రం కప్పు గెలవగలదన్న నమ్మకాన్ని వార్న్ వ్యక్తం చేశాడు.


Click it and Unblock the Notifications













