T20 World Cup 2022: ఆ నాలుగు తప్పిదాలే ఆస్ట్రేలియా కొంపముంచాయా..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సిడ్నీలో జరిగిన సూపర్-12 మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘోర పరాజయం మూటగట్టుకుంది. కివీస్ చేతిలో ఏకంగా 89 పరుగులు భారీ తేడాతో ఓడిపోయింది. గతేడాది టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ ను ఓడించిన కంగారులు ఈ మ్యాచ్ చేతులు ఎత్తేశారు. ఏ దశలోనూ కివీస్ కు పోటీ ఇవ్వలేదు. ఆసీస్ ఆటగాళ్లు బౌలింగ్ తోపాటు బ్యాటింగ్ లో కూడా రాణించలేదు. ఫీల్డింగ్ లో కూడా పలు తప్పిదాలు చేసింది. అయితే 89 పరుగుల భారీ తేడాతో ఆసీస్ ఓడిపోవడం ఆసీస్ అభిమానులను ఆశ్చర్య పరిచింది. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా ప్రధానంగా నాలుగు తప్పిదాలు చేసినట్లు క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఫీల్డింగ్ ఎంచుకోవడం
ఈ మ్యాచ్ టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం కురుస్తుందన్న భయంతో ఫీల్డింగ్ ఎంచుకుంది. కానీ సిడ్నీ పిచ్ మొదటగా బ్యాటింగ్ అనుకూలించింది. దీంతో న్యూజిలాండ్ 200 పరుగులు చేసింది.

కివీస్ ఓపెనర్లు
ఆస్ట్రేలియా కివీస్ ఓపెనర్ల దూకుడుకు కళ్లెం వేయలేకపయారు. న్యూజిలాండ్‌కు ఓపెనర్ ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే శుభారంభం అందించారు. ముఖ్యంగా ఫిన్ అలెన్ అయితే ఆరంభం నుంచే ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తొలి ఓవర్లనో అతను రెండు బౌండరీలు సిక్స్ బాదగా.. రెండో ఓవర్‌లో డేవాన్ కాన్వే సైతం రెండు ఫోర్లు కొట్టడంతో కివీస్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఫించ్ బౌలర్లను మార్చినా.. ఫిన్ అలెన్ మాత్రం తన దూకుడును తగ్గించలేదు. దాంతో కివీస్ 3.5 ఓవర్లలో 50 పరుగులను పూర్తి చేసుకుంది. అంతే కాకుండా ఫిన్ అలెన్ క్యాచ్ ను డ్రాప్ చేశారు.

బౌలర్ల వైఫల్యం
ఈ మ్యాచ్ లో ఆసీస్ బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. స్టార్క్ 4 ఓవర్లు వేసి 36 పరుగులిచ్చాడు. హజిల్ వుడ్ 4 ఓవర్లలో 41 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. కమ్మిన్స్ 4 ఓవర్లు వేసి 46 పరుగులిచ్చాడు. స్టోయినిస్ 4 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చాడు. జంపా 4 ఓవర్లు వేసి 39 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. బ్యాటింగ్ లో కూడా ఆసీస్ ఆటగాళ్లు విఫలమయ్యారు. ఓపెనర్లు డెవిడ్ వార్నర్ 5 పరుగులు చేయగా... ఫించ్ 13 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ 16, మ్యాక్స్ వెల్ 28, స్టోయినిస్ 7, టిమ్ డెవిడ్ 11, వెడ్ 2, ప్యాట్ కమ్మిన్స్ 21 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications