ముక్కోణపు టోర్నీలో ఆశలు సజీవం: జింబాబ్వేపై లంక విజయం

హైదరాబాద్: తిషార పెరీరా బ్యాట్‌తో పాటు బంతితో రాణించడంతో శ్రీలంక ముక్కోణపు వన్డే సిరిస్‌లో ఆశలు సజీవంగా ఉంచుకుంది. టోర్నీలో భాగంగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 44 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు 44 పరుగుల భాగస్వామ్యం అందించినప్పటికీ, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ తిషార పెరీరా దెబ్బకు పెవిలియన్‌కు చేరారు.
జింబాబ్వే జట్టులో టేలర్ (58) క్రీమర్ (34)లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగా... మిగిలిన వారంతా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. శ్రీలంక బౌలర్లలో తిషార పెరీరా (4/33) రాణించగా, ఫెర్నాండో 3, సందకన్ 2 వికెట్లు తీసుకున్నారు.
అనంతరం 199 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 44.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్లలో తిషార పెరీరా (39 నాటౌట్), చండిమాల్ (38 నాటౌట్) ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
తాజా విజయంతో శ్రీలంక జట్టు టోర్నీలో ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఒకానొక దశలో 145 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న లంకను చండిమాల్, తిషార జోడి 57 పరుగుల అజేయ భాగస్వామ్యంతో ఆదుకున్నారు. 45వ ఓవర్ చివరి బంతికి తిషార సిక్సర్ బాది లంకకు విజయాన్నందించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications