Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌తో వన్డే, టీ20ల కోసం శ్రీలంకకు కొత్త కెప్టెన్

Thisara Perera to lead Sri Lanka in ODIs, T20Is

హైదరాబాద్: టెస్టు సిరిస్ అనంతరం భారత్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌‌లకు శ్రీలంక జట్టుకు కెప్టెన్‌గా ఆల్‌ రౌండర్ తిషారా పెరీరాను నియమితులయ్యాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు బుధవారం నిర్ణయం తీసుకుంది.

ఈ ఏడాది జులైలో జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి సీనియర్ ఆటగాడు ఏంజెలో మ్యాథ్యూస్ వైదొలగిన నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఉపుల్ తరంగా, టెస్టు జట్టుకు దినేశ్ చండీమాల్‌కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే.

అయితే తరంగా నేతృత్వంలో శ్రీలంక జట్టు ఈ ఏడాది భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికాలతో జరిగిన మూడు సిరీస్‌లలో కూడా 5-0 తేడాతో ఘోరంగా ఓటమి పాలైంది. స్లో ఓవర్ రేట్ కారణంగా తరంగాపై ఐసీసీ మూడు మ్యాచ్‌లకు సస్పెన్షన్ వేటు కూడా వేసింది.

దీంతో తరంగా స్ధానంలో సారథ్య బాధ్యతలను పెరీరాకు అప్పగిస్తూ లంక బోర్డు నిర్ణయం తీసుకుంది. 28 ఏళ్ల పెరీరా శ్రీలంక తరుపున 125 వన్డేలాడి 1441 పరుగులు చేసి... బౌలర్‌గా వన్డేల్లో 133 వికెట్లు తీశాడు. అలాగే 63 టీ20లు, 6 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, November 29, 2017, 15:36 [IST]
Other articles published on Nov 29, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+