
హైదరాబాద్: భారత్‌కు శ్రీలంకకు బుధవారం టీ 20మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు ఘోరపరాజయాలను చవిచూసిన శ్రీలంక కెప్టెన్ తిసారా పెరీరా మనో నిబ్బరంతో ముందుకెళ్తున్నాడు. ఈ సందర్భంగా తాను మీడియాతో మాట్లాడాడు. గడిచిన సిరీస్ అంతా గడ్డుకాలంలా అనిపిస్తోందన్నాడు. టెస్ట్ , వన్డే మ్యాచ్‌ల పరాజయాలను ప్రస్తుతం పక్కకు పెట్టాలని అన్నాడు. డిసెంబరు 20 బుధవారం అంటే నేడు మొదలు కాబోతున్న టీ 20మ్యాచ్ కొత్త సిరీస్ అని దీనిని తాజాగా మొదలు పెడతామని అన్నాడు.
టీమిండియాతో బుధవారం ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌లో శ్రీలంక తిరిగి పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. వన్డే సిరీస్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు. మిగిలిన రెండు వన్డేల విషయాన్ని పట్టించుకోమని నొక్కి చెప్పాడు. ప్రతి సానుకూలాంశాలు అంశాలు గుర్తుంచుకోవాలని హితవు పలికాడు. ఈ టీ 20 సిరీస్‌తో వన్డే సిరీస్‌లో ఘోర పరాజయాల బాట నుంచి బయట పడతామన్నాడు. లంక టెస్టుల్లో 1-0తో, వన్డేల్లో 2-1 తేడాతో ఓడిన సంగతి తెలిసిందే.
మా జట్టులో డెత్ బౌలర్లు, పవర్ హిట్టర్లు ఉన్నారని వారి సామార్థ్యాన్ని గుర్తు చేశాడు. బారాబతిలో బుధవారం జరిగే మ్యాచ్‌లో మేం అత్యుత్తమంగా ఆడతామంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. యువ ఆటగాళ్లపై ఉన్న విశ్వాసాన్ని వారు నిలబెట్టుకుంటారన్నాడు. వారంతా సానుకూల దృక్పథంతో ఆడతామని ఈ మ్యాచ్ తో మళ్లీ ఫామ్ లోకి వస్తామని భరోసాని కనబరుస్తున్నాడు.
మ్యాచ్ రాత్రి జరుగుతుంది కాబట్టి వాతావరణం దృష్ట్యా రెండు జట్లు కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుందేమోనన్న సందేహాన్ని వ్యక్తం చేశాడు. చివరి వన్డేలో 82 బంతుల్లో 95 పరుగులు చేసిన ఉపుల్ తరంగను కొనియాడాడు. శ్రీలంక బ్యాటింగ్ కోచ్ తరంగ బ్యాటింగ్‌లో కొన్ని సాంకేతిక మార్పులు చేయడంతో కాస్త మంచి జరిగిందన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.