Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : ఈ మ్యాచ్ మూడు రోజులే.. తొలి టెస్టుపై మాజీ లెజెండ్ కామెంట్స్!

This will be a three day match says former legend

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టుపై భారత మాజీ లెజెండ్ సీరియస్ కామెంట్స్ చేశాడు. మ్యాచ్ జరుగుతున్న తీరు చూస్తుంటే తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగిసేలా ఉందన్నాడు.

అతనెవరో కాదు. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఆస్ట్రేలియా బ్యాటర్లంతా స్పిన్ కారణంగా అవుటవలేదని, కొందరు చెత్త షాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నారని భజ్జీ స్పష్టం చేశాడు.

చాప చుట్టేసిన ఆసీస్..

చాప చుట్టేసిన ఆసీస్..

తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా జట్టు 177 పరుగులకే ఆలౌట్ అయింది. స్టీవ్ స్మిత్, లబుషేన్ మధ్య నెలకొన్ని 82 పరుగుల భాగస్వామ్యమే ఆ జట్టులో టాప్. ఆ తర్వాత ఎవరూ పెద్దగా స్కోర్లు చేయలేకపోయారు. అదే సమయంలో భారత స్టార్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరూ చక్కగా రాణించారు. జడేజా ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగగా.. అశ్విన్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఈ క్రమంలో టెస్టుల్లో వేగంగా 450 వికెట్లు తీసుకున్న భారత బౌలర్‌గా అశ్విన్ రికార్డు సృష్టించాడు.

మూడ్రోజుల ఆటే..

మూడ్రోజుల ఆటే..

'ఆస్ట్రేలియా ఆటగాళ్లందరూ స్పిన్ కారణంగా అవుటవలేదు. కొంత మంది చెత్త షాట్లు ఆడి పెవిలియన్ చేరారు. మరికొందరు అసలు మ్యాచ్ మొదలవడానికి ముందు నుంచి జరుగుతున్న స్పిన్ మాటలతో బెదిరిపోయినట్లు కనిపించారు' అని భజ్జీ చెప్పాడు. రెండో రోజున భారత జట్టు చక్కగా బ్యాటింగ్ చేస్తే ఈ మ్యాచ్ టీమిండియాదే అని తేల్చేశాడు. 'ఈ మ్యాచ్ మూడ్రోజులకు మించి జరగదు. రెండో రోజు భారత్ ఆధిపత్యం చెలాయిస్తే.. మూడో రోజు కూడా కచ్చితంగా భారత్‌దే అవుతుంది' అని వివరించాడు.

అశ్విన్‌కు కంగ్రాట్స్..

అశ్విన్‌కు కంగ్రాట్స్..

అలాగే మ్యాచ్ ముందు అశ్విన్‌పై భజ్జీ అక్కసు వెళ్లగక్కాడని నెట్టింట పెద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఆసీస్ బ్యాటర్ల మనసులో అశ్విన్ భయం నెలకొందని మాజీ లెజెండ్ వసీం జాఫర్ ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన భజ్జీ.. ఆస్ట్రేలియా బ్యాటర్లకు గుబులు పుట్టిస్తోంది అశ్విన్ కాదని, పిచ్ అని సమాధానం ఇచ్చాడు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ అంతా భజ్జీని తిట్టిపోశారు. ఎప్పుడూ అశ్విన్ విషయంలో కుళ్లు చూపిస్తూనే ఉంటాడని విమర్శించారు. అయితే ఇప్పుడు మాత్రం అశ్విన్ వేగంగా 450 వికెట్లు తీసుకోవడంపై భజ్జీ సంతోషం వ్యక్తం చేశాడు. '450 వికెట్లు తీసుకున్నందుకు అశ్విన్‌కు కృతజ్ఞతలు. అశ్విన్, జడేజా జోడీ ఇలాగే భారత్‌కు ఎన్నో మ్యాచులు గెలిపిస్తుందని ఆశిస్తున్నా' అని చెప్పాడు.

Story first published: Friday, February 10, 2023, 9:51 [IST]
Other articles published on Feb 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+