Team India : ఈ టీమిండియా వెటరన్ బ్యాటర్ కెరీర్ ముగిసినట్లేనా?

ప్రస్తుతం భారత జట్టు టాప్ ఫామ్‌లో ఉంది. రోహిత్‌కు జోడీగా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అతను లేకపోతే ఓపెనింగ్ చేయడం కోసం ఇషాన్ కిషన్ రెడీగా ఉన్నాడు. గిల్ తన చివరి ఆరు వన్డేల్లో మూడు సెంచరీలు చేశాడు. వీటిలో ఒక డబుల్ సెంచరీ కూడా ఉండటం గమనార్హం. అలాగే ఇషాన్ కిషన్ కూడా బంగ్లాదేశ్‌పై భారీ డబుల్ సెంచరీ బాదాడు. ఇలాంటి క్రమంలో వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ కెరీర్ ముగిసినట్లే అనిపిస్తోంది.
ధవన్ కూడా గడిచిన మూడేళ్లలో ఒక్క అంతర్జాతీయ సెంచరీ కూడా చేయలేదు. కానీ 2020-2021లో అతను బాగానే రాణించాడు. సుమారు 50 సగటుతో పరుగులు చేశాడు. కానీ 2021-2022 సీజన్‌లో మాత్రం ధవన్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. గతేడాది టీ20 వరల్డ్ కప్ ఉండటంతో రోహిత్, విరాట్ వంటి సీనియర్లు వన్డే ఫార్మాట్లో ఆడలేదు. ఈ క్రమంలో ఆ జట్టుకు ధవన్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు. గతేడాది చాలా టోర్నీల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన ధవన్.. 22 మ్యాచుల్లో కేవలం 34 సగటు, 74 స్ట్రైక్ రేటుతో 688 పరుగులు మాత్రమే చేశాడు.

అదే సమయంలో గిల్ తన ఆటతీరును చాలా మెరుగు పరుచుకున్నాడు. అద్భుతమైన వన్డే బ్యాటర్‌గా పరిణితి చెందాడు. కిషన్ కూడా ఓపెనర్‌గా సత్తా చాటాడు. దీంతో అతన్ని వన్డే వరల్డ్ కప్ సెటప్ నుంచి సెలెక్టర్లు తప్పించారు. ఈ క్రమంలో తనకు దక్కిన అవకాశాన్ని గిల్ చక్కగా ఉపయోగించుకున్నాడు. శ్రీలంక, వన్డే సిరీసుల్లో అద్భుతంగా రాణించాడు. దీంతో ఇక మళ్లీ ధవన్ టీమిండియాలోకి పునరాగమనం చేయడం కష్టంగా కనిపిస్తోంది. ధవన్ మళ్లీ అద్భుతమైన ఫామ్ అందుకున్నా.. గిల్, కిషన్ ఫామ్‌లో ఉన్నంత కాలం ధవన్‌కు అవకాశం రావడం అసాధ్యం అని నిపుణులు అంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications