సవాళ్లపైనే దృష్టి సారిస్తా: గంగూలీతో విభేదాలపై రవిశాస్త్రి
హైదరాబాద్: విరాట్ కోహ్లీ నేతృత్వంలో భారత జట్టు ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు అని కొత్త కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి పేర్కొన్నాడు. కోచ్‌గా నియమించిన తర్వాత రవిశాస్త్రి తొలిసారి బుధవారం మీడియాతో మాట్లాడాడు.
క్రికెట్ సలహా కమిటీలో సభ్యుడిగా ఉన్న సౌరవ్ గంగూలీతో తనకు ఎలాంటి సమస్య లేదని చెప్పాడు. కోచ్‌గా తన ముందున్న సవాళ్లపైనే తాను దృష్టి సారిస్తానని రవిశాస్త్రి చెప్పాడు. ఇద్దరి మధ్య ఉన్న విభేదాల కంటే టీమిండియా ప్రయోజనాలే ముఖ్యమని రవిశాస్త్రి స్పష్టం చేశాడు.

ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు
"ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు. మేమిద్దరం మాజీ కెప్టెన్లమే. కొన్ని భేదాభిప్రాయాలు సహజమే. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూలో నన్ను కొన్ని మంచి ప్రశ్నలు అడిగారు. వాటికి సమాధానం చెప్పాను. మీటింగ్‌లో ఏం జరిగిందో అదంతా రహస్యమే. భారత క్రికెట్ ప్రయోజనాల దృష్ట్యా మనం ముందడుగు వేయాల్సిందే" అని రవి శాస్త్రి అన్నాడు.

ఏమైనా టెన్షన్‌కు గురయ్యారా?
ఇక ఇంటర్వ్యూకు వెళ్లే ముందుగానీ, కోచ్‌ను ప్రకటించే ముందుగానీ ఏమైనా టెన్షన్‌కు గురయ్యారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు రవిశాస్త్రి తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. కోచ్ పేరుని ప్రకటించే సమయంలో తాను లండన్‌లో ఎంజాయ్ చేస్తున్నా చెప్పాడు. గంగూలీ, సచిన్, లక్ష్మణ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) రవిశాస్త్రిని టీమిండియా కొత్త కోచ్‌గా ఎంపిక చేయగా అందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

2019 వరల్డ్‌కప్ వరకు రవిశాస్త్రినే కోచ్
2019 వరల్డ్‌కప్ వరకు రవిశాస్త్రినే కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. తన మందున్న సవాళ్లను గురించి ప్రశ్నించగా "నేను సాధ్యమైనంత త్వరగా పని మొదలుపెట్టాలని అనుకుంటున్నా. మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఇది బెస్ట్ టీమ్‌గా తయారవుతుంది. నేను డైరెక్టర్‌గా ఎక్కడ వదిలేశానో అక్కడి నుంచి మళ్లీ మొదలుపెడతా" అని రవి శాస్త్రి చెప్పాడు.

కోహ్లీ ఓ చాంపియన్
ఇక కోహ్లీ వైఫల్యాలపై మీడియా ప్రశ్నించగా కోహ్లీ ఓ చాంపియన్ అని, ఫెయిలయ్యే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని అన్నాడు. ఇక యువరాజ్, ధోనీలపై స్పందిస్తూ 2019 వరల్డ్‌కప్ ఇంకా చాలా దూరంలో ఉందని, సరైన సమయంలో వారిపై ఓ నిర్ణయం తీసుకుంటామని రవిశాస్త్రి చెప్పాడు.

కోచ్ బాధ్యతలు అందుకోవడం తొలిసారి
కాగా, గతంలో టీమిండియా డైరెక్టర్‌గా, జట్టు మేనేజర్‌గా రవిశాస్త్రి కోచ్ బాధ్యతలే నిర్వర్తించినప్పటికీ అధికారికంగా కోచ్ బాధ్యతలు అందుకోవడం రవిశాస్త్రికి ఇదే తొలిసారి. గ్రెగ్ ఛాపెల్ వివాదాస్పద నిష్క్రమణ ఫలితంగా 2007లో భారత జట్టు మేనేజర్‌గా రవిశాస్త్రి బంగ్లా పర్యటనకు వెళ్లాడు. మరోవైపు డంకన్ ఫ్లెచర్ ప్రధాన కోచ్‌గా ఉండగానే 2014 నుంచి 2016 వరకు టీమిండియా డైరెక్టర్‌గా వ్యవహరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications