ఆట పట్టించిన కుల్దీప్: శాంటా ధోనిని మీరు చూశారా? (ఫోటోలు)

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన చివరిదైన మూడో టీ20 చివర్లో ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం జరిగే ప్రజెంటేషన్ కార్యక్రమ సమయంలో అక్కడి వాతావరణం అంతా సందడిగా మారింది.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డుల ప్రజెంటేషన్ జరుగుతుంటే భారత జట్టులోని ఆటగాళ్లు సెల్ఫీలు దిగారు. ఆటగాళ్లంతా తలకు శాంటా క్లాజ్ టోపీలు పెట్టుకుని మైదానంలో సందడి చేశారు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్... ఓ ప్రత్యేకమైన ట్రోఫీని ధోనికి అందజేశారు.
అయితే ధోని ధరించిన శాంటా క్లాజ్ ట్రోఫీ మిగతా ఆటగాళ్లతో పోలిస్తే కాస్తంత భిన్నంగా ఉంది. ధోనీ పెట్టుకున్న టోపీకి ఓ మీసం, గెడ్డం, కళ్లు, ముక్కు ఉన్నాయి. ఆ టోపిని ధరించిన అనంతరం ధోని తెగ మురిసిపోయాడు. తన తలను అటు ఇటు తిప్పుతూ శాంటా లాగే ధోని కాసేపు ప్రవర్తించాడు.
ఈ సమయంలో కుల్దీప్ యాదవ్ అయితే ఆ టోపీకి ఉన్న గెడ్డంతో ధోనిని ఆటపట్టించడం విశేషం. అనంతరం హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ అయితే సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ధోని శాంటా క్లాజ్ ధరించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications