హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మైదానంలో ఎంత కూల్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలోని మిగతా ఆటగాళ్లు ఒత్తిడికి గురైనప్పటికీ, ధోని మాత్రం ఎప్పుడూ చాలా కూల్‌గానే కనిపిస్తాడు.
అంతేకాదు తీవ్ర ఉత్కంఠ మధ్య కూడా ప్రశాంతంగా వికెట్ల వెనుక నిలబడి బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేయడానికి ధోని వ్యూహాలను రచిస్తూ ఉంటాడు. అయితే ఒత్తిడిని అధిగమించడానికి, జట్టులోని తన సహచరుల్లో ఉత్సాహం నింపడానికి అప్పుడప్పుడు ధోని జోకులు కూడా వేస్తాడంట.

ఇందుకు సంబంధించి ధోనితో చోటు చేసుకున్న ఓ సరదా సన్నివేశాన్ని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ చెప్పాడు. ధోని తుమ్మినప్పుడు దేవుడా నన్ను వదిలేసి ఇతన్ని తీసుకెళ్లు అని తన పక్కనున్న ఫీల్డర్‌ను ఉద్దేశించి అంటాడట. దీని అర్ధం ఏమిటంటే పక్కనున్న వాడికి ఏమైనా ఫర్వాలేదు గానీ తనకు మాత్రం ఏం కాకుడదన్నమాట.
ఈ మాట వినగానే జట్టులోని మిగతా ఆటగాళ్లందరూ ధోని పక్కన నిల్చున్న ఫీల్డర్ కోసం కాసేపు ప్రార్థిస్తామని శిఖర్ ధావన్ చెప్పాడు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరిస్‌కు ఎంపికైన శిఖర్ ధావన్ తన భార్య అనారోగ్య కారణంగా సిరిస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.
వన్డే సిరిస్ అనంతరం ఆస్ట్రేలియాతో శనివారం జరిగే మూడు టీ20ల సిరిస్‌కు సెలక్టర్లు ఎంపిక చేసిన 15 మంది జట్టు సభ్యుల్లో ధావన్ చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో ధావన్ ఎన్డీటీవీకి ఇంటర్యూ ఇచ్చాడు. ఇదిలా ఉంటే మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా తొలి టీ20 శనివారం రాంచీ వేదికగా జరగనుంది.