For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్ రికార్డ్ బ్రేక్: తల్లి దేవుడి వరమని కోహ్లీ(వీడియో)

న్యూఢిల్లీ: మాతృదినోత్సవం సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ తన తల్లితో పాటు అందరికీ శుభాకాంక్షలు తెలిపాడు. 'మాతృ మూర్తులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు' అంటూ తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

'నాపై అత్యంత ప్రేమ చూపుతూ.. ఎప్పుడూ మద్దతుగా నిలిచే మా అమ్మకు ప్రత్యేక శుభాకాంక్షలు, ఎలాంటి పరిమితులు లేనిదే అమ్మప్రేమ. మనం కూడా ఎటువంటి షరతులు లేని ప్రేమని తిరిగి వారికివ్వాలి. అమ్మ భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం' అని కోహ్లీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో తెలిపాడు. 'జీవితంలో ఎంతో మద్దతుగా నిలుస్తున్నందుకు ఆమెకు కృతజ్ఞతలు' అంటూ కోహ్లీ పేర్కొన్నాడు.

This Mother's Day Message From Virat Kohli Will Surely Make You Remember Your Mom

సచిన్ రికార్డు బ్రేక్

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో నెలకొల్పిన రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. రెండు ఐపీఎఎల్ సీజన్లలో సచిన్ టెండూల్కర్ 500కు పైగా పరుగులు చేశాడు. కాగా, విరాట్ కోహ్లీ మూడు ఐపిఎల్ సీజన్లలో 500కు పైగా పరుగులు చేసి సచిన్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.

వివరాల్లోకి వెళితే.. మాస్టర్‌ 234 ఇన్నింగ్స్‌ల్లో 25 శతకాలు సాధిస్తే విరాట్‌ కేవలం 162 ఇన్నింగ్స్‌ల్లోనే దాన్ని అధిగమించేశాడు. ఇక పరుగుల విషయానికొస్తే సచిన్‌ 171 వన్డేల్లో 38.85 సగటుతో 5828 పరుగులు చేయగా కోహ్లీ 51.51 సగటుతో 7212 పరుగులు సాధించడం విశేషం. ఈ ఐపీఎల్‌లో సచిన్‌ మరో రికార్డును బద్ధలు కొట్టాడు కోహ్లి.

ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు సారథ్యం వహిస్తున్న విరాట్‌ కోహ్లి తాజా సీజన్‌లో 541 పరుగులు చేయడంతో మాస్టర్‌ బ్లాస్టర్‌ రికార్డు బద్దలైంది. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా సచిన్‌ రెండుసార్లు 500పైచిలుకు పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.

2010లో 618, 2011లో 553 చేశాడు. కోహ్లీ 2013లో 634, 2015లో 505 పరుగులు
చేశాడు. భీకర ఫామ్‌తో ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు శతకాలతో 541 పరుగులు చేసి మూడోసారి 500కుపైగా పరుగులు చేయడంతో సచిన్‌ రికార్డు బ్రేక్‌ అయింది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+