కోల్‌కత్తా: ఐసీసీ వరల్డ్ టీ20లో భాగంగా కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన భారత్-పాక్ మ్యాచ్‌లో భారత్ జట్టు పాకిస్థాన్ జట్టుపై విజయం సాధించడం ఆ దేశ ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోగానే అఫ్రీదీని తిట్టిన పాకిస్థాన్ మోడల్, నటి క్వండిల్ బలోచ్ ఇప్పుడు కొత్త పల్లవి అందుకుంది.

ఈడెన్ గార్డెన్స్‌లో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిస్తే నగ్నంగా డ్యాన్స్ చేస్తానని ప్రకటించి పెద్ద సంచలనానికి తెరలేపింది. తాను చెప్పినట్లుగానే పాకిస్థాన్ ఓటిమి పాలైనందుకు బికినీలో డ్యాన్స్ చేసిన వీడియోని పోస్టు చేసి అభిమానులకు కనువిందు చేసింది. తాజాగా మరో ట్వీట్‌తో వార్తల్లో నిలిచింది.
'అఫ్రీదీ బేబీ నువ్వే నా లవర్' అంటూ ఓ సెల్ఫీ వీడియోని నెట్‌లో పెట్టి రెచ్చిపోయిన ఈ మోడల్ ఇప్పుడు విరాట్ కోహ్లీ కావాలంటోంది. కోహ్లీని లవ్ చేస్తున్నానంటూ ట్వీట్ చేసింది. ఈ లవ్ ప్రపోజల్‌లో బలోచ్ కాస్తంత వెటకారాన్ని జోడించింది. ఆ వెటకారం ఏంటంటే తాను కోహ్లీని ప్రేమిస్తున్నానంటూనే... అనుష్క శర్మ పేరును ప్రస్తావిస్తూ ట్వీట్ చేసింది.
భారత్ చేతిలో మరోసారి ఓటమిపాలైన పాక్ జట్టుపై కండీల్ బలోచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆశలను అడియాశలు చేశాడని అఫ్రిదీపై మండిపడింది. అతనొక పిచ్చివాడని దుయ్యబట్టింది. అఫ్రిదీ వెంటనే క్రికెట్ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసిన కండీల్.. కోచ్ వకార్ యూనిస్‌ను చచ్చిపోవాలని కోరింది.