కోచ్ రేసులో ఆసక్తికర కోణం: శాస్త్రి అనూహ్య నిర్ణయం వెనుక సచిన్?
హైదరాబాద్: ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామాతో కొత్త కొచ్ ఎంపిక అనివార్యమైంది. మే 31 నాటికి గడువు ముగిసే సమయానికి కోచ్ పదవి కోసం టామ్‌మూడీ, రిచర్డ్ పైబస్, లాల్‌చంద్ రాజ్‌పుత్, దొడ్డా గణేష్‌లు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.
తాజాగా టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి కూడా తాను కోచ్ పదవికి దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. నిజానికి రవిశాస్త్రి కొన్ని రోజుల కింది వరకు కోచ్ పదవికి దరఖాస్తు చేసేందుకు సుముఖంగా లేడు. అసలు దరఖాస్తే చేయనని చెప్పిన ఈ మాజీ కెప్టెన్ ఉన్నట్టుండి మనసు మార్చుకోవడానికి గల కారణాలేంటి?
నిజానికి కోచ్ పదవి కోసం మళ్లీ తాను ఇంటర్వ్యూకు హాజరు కాలేనని, బాధ్యతలు ఇస్తే స్వీకరిస్తానని స్పష్టంగా చెప్పాడు. దీని వెనుక అసలు ఏం జరిగింది. ఉన్నపళంగా రవిశాస్త్రి కోచ్ పదవికి దరఖాస్తు చేస్తానని చెప్పడం ఆశ్చర్య పరిచింది. అందరూ అనుకుంటున్నట్లుగా ఈ మొత్తం ఎపిసోడ్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీయే సూత్రధారియా లేక మరెవరికైనా సంబంధం ఉందా? అంటే ఓ ఆసక్తికర కోణం బయటకు వచ్చింది.
అయితే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్... రవిశాస్త్రితో మాట్లాడి అతన్ని కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేలా ఒప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు కెప్టెన్ కోహ్లీ కూడా శాస్త్రికి మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే.

టీమిండియాకు మాజీ డైరెక్టర్‌గా రవిశాస్త్రి సేవలు
గతేడాది అనిల్ కుంబ్లే కంటే ముందు టీమిండియాను రవిశాస్త్రి డైరెక్టర్ హోదాతో నడిపించాడు. ఆయన మార్గదర్శనంలోనే భారత జట్టు టి20, వన్డే ప్రపంచకప్‌లలో సెమీఫైనల్స్ చేరింది. ఆ తర్వాత బీసీసీఐ కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించడం... రవిశాస్త్రిని కాదని కుంబ్లేను కోచ్‌గా ఎంపిక చేయడం చకా చకా జరిగిపోయాయి.

కోహ్లీతో విభేదాల కారణంగా కుంబ్లే రాజీనామా
అయితే ఏడాది తర్వాత తాజాగా కోహ్లీతో విభేదాల కారణంగా కోచ్ పదవికి కుంబ్లే రాజీమానా చేయడం... ఖాళీ అయిన కోచ్ పదవికి బీసీసీఐ మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రేసులోకి రవిశాస్త్రి రావడంతో సీఏసీ ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

గంగూలీ వర్సెస్ రవిశాస్త్రి
గతేడాది కూడా కుంబ్లేతో కోచ్ పదవికి రవిశాస్త్రి పోటీపడ్డాడు. అప్పుడూ సచిన్ సీఏసీ ఇంటర్వ్యూలో ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థించారు. కానీ గంగూలీ... కుంబ్లేవైపు మొగ్గుచూపడం, మరో సభ్యుడు వీవీఎస్ లక్ష్మణ్ కూడా కుంబ్లేకే ఓటేయడంతో రవిశాస్త్రిని కోచ్ పదవికి ఎంపిక చేయలేదు.

సచిన్ సూచనతో కోచ్ రేసులోకి
దీనిపై రవిశాస్త్రి బాహటంగానే గంగూలీని విమర్శించారు. ఇపుడు కూడా కోచ్ పదవికి అర్హుడిని తేల్చేది సీఏసీనే కాబట్టి గంగూలీ వ్యతిరేకత దృష్ట్యా తనకు ఆ అవకాశం రాదని రవిశాస్త్రి తొలుత దరఖాస్తు చేసుకోలేదు. ప్రస్తుతం కుటుంబంతో లండన్‌లో సేదతీరుతున్నారు. అయితే అనూహ్యంగా అక్కడి నుంచే కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు.

బీసీసీఐ వైఖరేంటి?
ఇప్పటికే సెహ్వాగ్, టామ్ మూడీతో సహా పలువురు చీఫ్ కోచ్ పదవికి దరఖాస్తులు చేశారు. ఇప్పుడు శాస్త్రి కూడా జతకావడంతో అనిల్ కుంబ్లే వారసుడిని ఎంపిక చేసే పనిలో సీఏసీ నిమగ్నమైంది. అయితే కోచ్ ఎంపికలో బీసీసీఐ వైఖరి ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకంగా మారినా.. వివిధ కోణాల్లో అందుతున్న సమాచారాన్ని విశ్లేషిస్తే.. బోర్డు పెద్దలందరూ కోహ్లీకి మద్దతు పలికేందుకు సిద్ధంగా ఉన్నారని తేలింది. ఇప్పుడు వీళ్లకు సచిన్ కూడా జతకలిశాడు. ఇంతకుముందే విరాట్ కోహ్లీ కూడా తన అభిప్రాయాన్ని సచిన్‌తో స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. జట్టులోని సీనియర్ ఆటగాళ్లు కూడా శాస్త్రి వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో కోచ్ పదవికి రవిశాస్త్రి ఫేవరెట్‌గా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications