సచిన్ నుంచి సెహ్వాగ్ వరకు: చరిత్ర సృష్టించిన కోహ్లీసేనపై ప్రశంసల వర్షం


హైదరాబాద్: ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా 1992 నవంబరు మొదలు.. 25 ఏళ్లుగా టీమిండియా సఫారీ పర్యటనకు వెళ్తోంది. ఇప్పటివరకు ఏడు టెస్టు సిరిస్‌లు, ఏడు వన్డే సిరీస్‌లు ముగిశాయి. కానీ, ఏ ఫార్మాట్‌లోనూ సిరీస్ విజయం సాధించలేదు. అయితే ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.
కోహ్లీసేన భారత అభిమానుల కలను నెరవేర్చింది. సఫారీ గడ్డపై కోహ్లీసేన తొలిసారి వన్డే సిరిస్‌ను నెగ్గి చరిత్ర సృష్టించింది. పోర్ట్ ఎలిజబెత్‌లో మంగళవారం జరిగిన ఐదో వన్డేలో సఫారీ జట్టును 73 పరుగులతో ఓడించి సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకోవడంతో పాటు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది.
చివరి వన్డేలో భారత జట్టు ఓడినా ఐసీసీ వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. కెప్టెన్‌గా 48 వన్డే మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన కోహ్లీకి ఇది 37వ విజయం. అంతకాదు టీమిండియా వరుసగా 9 ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను గెలుచుకొంది. వరుసగా 14 సిరీస్‌లను కైవసం చేసుకున్న రికార్డు వెస్టిండీస్ పేరిట ఉంది.
ఈ సిరిస్‌లో చివరిదైన ఆరో వన్డే సెంచూరియన్ వేదికగా శుక్రవారం జరగనుంది. సఫారీ గడ్డపై చరిత్ర సృష్టించిన కోహ్లీసేనపై భారత మాజీ క్రికెటర్లు, సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పశంసల జల్లు కురిపిస్తున్నారు.
సచిన్ టెండూల్కర్
సిరీస్ టీమిండియా వశమైంది. మణికట్టు స్పిన్నర్లు కుల్‌దీప్ యాదవ్, చాహల్ ఆకట్టుకున్నారు. రోహిత్ శర్మ నుంచి మరో గొప్ప ఇన్నింగ్స్
వీరేంద్ర సెహ్వాగ్
సఫారీ గడ్డపై తొలి ద్వైపాక్షిక సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత క్రికెట్ జట్టుకు అభినందనలు. ఈ పర్యటనలో భారత జట్టు ఎంతో నిలకడగా ఆడుతూ విజయాలను సొంతం చేసుకుంది. ఈ జట్టు ఎంతో ప్రత్యేకమైనది
మహమ్మద్ కైఫ్
విరాట్ కోహ్లీ, భారత జట్టుకు అభినందనలు. మరో అద్భుత ప్రదర్శనతో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. కోహ్లీ సేన అంటే ఇదే. ఇది ప్రత్యేకమైన జట్టు. గొప్ప ఫలితం:
వీవీఎస్ లక్ష్మణ్
చరిత్ర సృష్టించిన భారత జట్టుకు అభినందనలు. మణికట్టు స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. ఈ విజయం విరాట్ కోహ్లీతో పాటు సహచర ఆటగాళ్లకు ఎంతో తియ్యనిది. సఫారీగడ్డపై బాగా ఆడుతున్నారు
మనోజ్ తివారి
దక్షిణాఫ్రికా గడ్డపై తొలి ద్వైపాక్షిక వన్డే సిరీస్ కైవసం చేసుకున్న భారత జట్టుకు అభినందనలు. పండగ చేసుకోండి
ఇర్ఫాన్ పఠాన్
సఫారీ గడ్డపై టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. చాలా జట్లు ఈ ఘనతను సాధించలేకపోయాయి. స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు
ఆకాశ్ చోప్రా
దక్షిణాఫ్రికాలో సిరీస్ గెలిచాం. గతంలో ఏ భారత జట్టు సాధించలేనిదది ఈ జట్టు సాధించింది. వెల్‌డన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications