Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Champions Trophy అసలు పేరు ఇదే.. 8 ఏళ్లు ఈ ట్రోఫీకి గ్యాప్ ఎందుకు వచ్చిందంటే?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి వేళైంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత జరగనున్న ఈ మినీ ప్రపంచ కప్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మెగా టోర్నీలో విజయం సాధించి ఎలాగైనా ట్రోఫీని ముద్దాడలనే పట్టుదలతో ఉందీ భారత జట్టు. ఈ సందర్భంగా అసలు ఛాంపియన్స్ ట్రోఫీ ఎలా మొదలైంది?, ఎప్పుడు ప్రారంభమైంది? దాని లక్ష్యమేంటి? వంటి పలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..

ఇదే ప్రధాన లక్ష్యం..
ఈ ఛాంపియన్స్‌ ట్రోఫీని ఐసీసీ తొలిసారిగా 1998లో ప్రారంభించింది. అప్పుడు ఈ మెగా టోర్నీ అసలు పేరు ఐసీసీ నాకౌట్‌ ట్రోఫీ. టెస్టు క్రికెట్ ఆడని దేశాల్లో.. క్రికెట్‌ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా, అందుకోసం నిధులు సమీకరించడమే ప్రధాన లక్ష్యంగా ఈ ప్రతిష్టాత్మక టోర్నికి శ్రీకారం చుట్టారు. చివరగా 2017లో ఈ టోర్నీ జరిగింది. 2002లో ఈ ఐసీసీ నాకౌట్ ట్రోఫీని.. ఛాంపియన్స్‌ ట్రోఫీగా పేరు మార్చారు.

This is the reason why champions trophy discontinued for 8 years after 2017

అందుకే 8 ఏళ్ల పాటు..
ఈ ఛాంపియన్స్ టోర్నీని మొదటి నుంచి వన్డే ఫార్మాట్లోనే నిర్వహిస్తున్నారు. తొలిసారి ఈ ట్రోఫీకి బంగ్లాదేశ్‌ ఆతిథ్యమిచ్చింది. 2000 - 2004 వరకు అసోసియేట్‌ దేశాలు కడా ఈ టోర్నీ బరిలోకి దిగేవి. కానీ 2009 నుంచి టాప్‌-8 జట్లతోనే ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. అయితే ప్రతి ఫార్మాట్‌లోనూ ఒకటే మెగా టోర్నీ ఉండాలన్న నిర్ణయంతో 2017 తర్వాత దీనిని నిర్వహించడం ఆపేశారు. కానీ మళ్లీ నిర్ణయం మార్చుకున్న ఐసీసీ.. ఛాంపియన్స్‌ ట్రోఫీని తిరిగి నిర్వహిస్తామని 2021 నవంబరులో అనౌన్స్ చేసింది. పాకిస్థాన్‌కు హోస్టింగ్ రైట్ హక్కులను ఇచ్చింది. 2029 సీజన్ భారత్‌ వేదికగా జరగనుంది.

ఎవరెవరు ఎప్పుడెప్పుడు గెలిచారు?
1998లో జరిగిన తొలి ఎడిషన్ లో సౌతాఫ్రికా విజేతగా అవతరించింది. 2000లో న్యూజిలాండ్ గెలవగా.. 2002లో శ్రీలంక - టీమిండియా కలిసి సంయుక్తంగా ట్రోఫీని గెలుచుకున్నారు. 2004లో వెస్టిండీస్, 2006, 2009లో ఆస్ట్రేలియా రెండు సార్లు, 2013లో టీమిండియా, 2017లో పాకిస్థాన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీని దక్కించుకున్నాయి.

Story first published: Tuesday, February 18, 2025, 15:57 [IST]
Other articles published on Feb 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+