ప్రేమ కోసం ఐపీఎల్ టిక్కెట్లు తెప్పించిన భజ్జీ

ముంబై: టీమిండియా వెటరన్ క్రికెటర్ తన ప్రేమ వివాహం గురించి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో గుర్తు చేసుకున్నాడు. బాలీవుడ్ నటి గీతా బస్రాను కలుసుకున్నప్పటి మధుర క్షణాలను పంచుకున్నాడు. 2015 అక్టోబర్‌లో గీతా-హర్భజన్‌ల వివాహం ఘనంగా జరిగింది. 2016లో వీరికి సంతానంగా పండంటి పాప పుట్టింది. భజ్జీ లవ్ స్టోరీ తొలినాళ్లలో గీతతో తాను ప్రేమలో ఎలా పడ్డాడో.. ఆమెను కలుసుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో ఓ కార్యక్రమంలో వెల్లడించారు.

నేహా ధుపియా వ్యాఖ్యాతగా నో ఫిల్టర్ నేహా
ప్రస్తుతం సినీ నటి నేహా ధుపియా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘నో ఫిల్టర్ నేహా' కార్యక్రమంలో తన ప్రేమకథను చెప్పుకొచ్చాడు భజ్జీ. ‘గీతను ఓ సినిమా పోస్టర్‌లో చూసి ఇష్టపడ్డాను. నా కంటే సినిమా సంగతులు ఎక్కువగా యువరాజ్ సింగ్‌కి తెలుసని అతణ్ని అడిగా. తన ఫొటోను చూపించడంతో యువరాజ్ సింగ్ కూడా తనకు తెలియదని చెప్పాడు. కానీ, నాకు ఆ వివరాలు తప్పక కావాలని తెలుసుకొమ్మని చెప్పాను.

గీతకు మెసేజ్ చేసి కాఫీ షాప్‌లో కలుద్దామని
'అప్పట్లో మాకు సువేద్ లోహియా అని ఓ స్నేహితుడు ఉండేవాడు. గీతకు సువేద్ తెలుసు. అతని ద్వారా గీతను కలుసుకోగలిగాను. మరో విషయం ఏంటంటే.. అదే సమయంలో ప్రపంచకప్ గెలిచాం. మ్యాచ్ ముగిశాక తిరిగి ముంబైకి వచ్చేశాను. ఆ తర్వాత గీతకు మెసేజ్ చేసి కాఫీ షాప్‌లో కలుద్దామని చెప్పాను. కానీ తన నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. కొద్ది రోజుల్లోనే ఐపీఎల్ మొదలైంది.

ఐపీఎల్ టికెట్స్ దొరుకుతాయా
‘మాకు టికెట్స్ దొరుకుతాయా?' అని గీత నన్ను అడిగింది. కానీ టికెట్ తన కోసం కాదని తన డ్రైవర్ కోసమని చెప్పింది. అయినా పర్లేదని టికెట్స్ నేనే ఇప్పించాను. టిక్కెట్స్ విషయంలో తనకు సాయం చేశాను కాబట్టే.. తను కాఫీకి రావడానికి ఒప్పుకొంది. అలా కొన్ని రోజుల పాటు తరచూ కలుసుకుంటూ ఉండేవాళ్లం.
నాకు ముందు కెరీర్ ముఖ్యం
ఇక ఉండబట్టలేక ఓసారి పెళ్లి గురించి అడిగేశా.. దానికి సమాధానంగా‘నాకు ముందు కెరీర్ ముఖ్యం' అని చెప్పింది. నేను కూడా నాకు కెరీరే ముఖ్యం అని చెప్పాను. అలా తొమ్మిది నెలలు గడిచాక పెళ్లికి ఒప్పుకొంది' అని తన ప్రేమకథను చెప్పుకొచ్చాడు భజ్జీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications