న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అవును, నువ్వే కదా స్లెడ్జింగ్‌కు పాల్పడింది?: పంత్‌తో ఆసీస్ ప్రధాని

This is Epic: Australian PM Asked From Pant About Sledging

హైదరాబాద్: మెల్‌బోర్న్ టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేసిన స్లెడ్జింగ్‌పై సాక్షాత్తూ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మొర్రిసన్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సుదీర్ఘ పర్యటన కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా న్యూ ఇయర్ వేడుకలను సైతం ఆస్ట్రేలియాలోనే జరుపుకుంది. అయితే, నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని భారత జట్టుతో పాటు ఆతిథ్య జట్టును ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మొర్రిసన్ తన నివాసానికి విందుకు ఆహ్వానించారు.

విందులో భాగంగా ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లను ఆయన పరిచయం చేసుకున్నారు. ఇరు జట్ల కెప్టెన్లతో ప్రత్యేకంగా ఫోటోలు దిగారు. ఆ తర్వాత ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

పంత్ స్లెడ్జింగ్‌పై ఆసీస్ ప్రధాని

అయితే, భారత జట్టుకు చెందిన ఆటగాళ్లను పరిచయం చేసుకునే సమయంలో రిషబ్ పంత్‌ను చూసిన ఆసీస్ ప్రధాని స్లెడ్జింగ్ గురించి అడిగడం విశేషం. అవును, నువ్వే కదా స్లెడ్జింగ్ చేసింది అని రిషబ్ పంత్‌కు షేక్ హ్యాండ్ ఇస్తూ అడిగాడు. దీంతో పంత్ ఒక్కసారి ఫక్కున నవ్వడంతో అక్కడ నవ్వులు పూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు స్లెడ్జింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఈ స్లెడ్జింగ్ తక్కువగానే కనిపించినప్పటికీ, మెల్ బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో మాత్రం మరింత తీవ్రరూపం దాల్చింది. బాక్సింగ్ డే టెస్టులో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు ఒకరిపై మరొకరు వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసుకున్నారు. క్రీజులో పాతుకుపోయిన నిలకడగా ఆడుతోన్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

హాబర్ట్ హారికేన్స్ టీమ్‌‌లోకి తీసుకుంటా

అంతకముందు పంత్‌ను ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ కవ్వించిన సంగతి తెలిసిందే. ధోనీ పేరుని ప్రస్తావిస్తూ రిషబ్ పంత్‌ని కవ్వించాడు. "ధోనీ మళ్లీ వికెట్ కీపర్‌గా భారత వన్డే, టీ20 జట్టులోకి వచ్చేశాడు. కాబట్టి, నిన్ను బిగ్‌బాష్ టోర్నీలోని హాబర్ట్ హారికేన్స్ టీమ్‌‌లోకి తీసుకుంటా. ఈ డీల్‌ ఓకే అయితే బాగుంటుంది కదా? నువ్వు కూడా ఆస్ట్రేలియా హాలిడేస్‌ని మరింతగా ఎంజాయ్‌ చేసే అవకాశం దొరుకుతుంది" పంత్ ఏకాగ్రతని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు.

పంత్ బెస్ట్‌ బేబీసిట్టర్‌ అని ప్రశంసలు కురిపించిన పైన్ భార్య

పంత్-పైన్ మధ్య నడిచిన మాటల యుద్ధంపై అటు క్రికెట్ అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో తెగ్ ట్రోల్ చేశారు. దీంతో ఆటగాళ్ల మధ్య చోటు చేసుకున్న ఈ స్లెడ్జింగ్‌ మరే వివాదానికి దారితీస్తుందో అని క్రికెట్‌ అభిమానులు కవలవరపడ్డారు. అయితే, ఇదంతా ఆటలో భాగమేనని, మైదానం దాటితే తామంతా మంచి స్నేహితులమని పంత్‌ నిరూపించాడు. "పంత్‌.. నా పిల్లలను ఆడించు.. నేను నా భార్యను సినిమాకు తీసుకెళ్తా" అని సరదాగా అన్న వ్యాఖ్యలను పంత్‌ సీరియస్‌గా తీసుకున్నాడో ఏమో కానీ అతను అన్నట్లే టిమ్ పైన్‌ భార్య బొనీ పైన్‌ను కలిసి వారి పిల్లలను ఆడించాడు. ఈ విషయాన్ని బొనీ పైన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. దీంతో పాటు పంత్ బెస్ట్‌ బేబీసిట్టర్‌ అని ప్రశంసలు కురిపించింది.

Story first published: Wednesday, January 2, 2019, 15:16 [IST]
Other articles published on Jan 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X