Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అప్పటి విజయంలో ద్రవిడ్.. ఇప్పుడు పూజారా

 This has brought back memories of 2003: Twitter hails India’s win in thrilling Adelaide Test

అడిలైడ్: విజయకాంక్షతో ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత్‌కు శుభారంభమే లభించింది. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ఛతేశ్వర పుజారాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. కాగా, పుజారాకు ఆసియా వెలుపల జరిగిన మ్యాచ్‌లలో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకుంది ఈ ఆటలోనే. రెండు ఇన్నింగ్స్‌లోనూ తనదైన మార్క్ ప్రదర్శన చూపించి వరుసగా వికెట్లు పడుతున్నా.. క్రీజులో పాతుకుపోయాడు.

ఆసీస్ బ్యాట్స్‌మెన్ పోరాడినప్పటికీ భారత్‌దే

ఆసీస్ బ్యాట్స్‌మెన్ పోరాడినప్పటికీ భారత్‌దే

బౌలర్లు రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ పుజారా (71 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించాడు. వీరోచిత సెంచరీతో పోరాడి స్కోరు అందించాడు. దాంతో పాటుగా రహానే కూడా హాఫ్ సెంచరీ సాధించడంతో టీమిండియా 307 పరుగులు చేసింది. మరో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ పోరాడినప్పటికీ భారత్‌దే పైచేయిగా నిలిచింది. ఆసీస్‌ గడ్డ మీద జరిగిన టెస్టు సిరీస్ తొలి మ్యాచ్‌లోనే భారత్ గెలుపొందడం ఇదే మొదటిసారి.

2003లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

2003లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

2003వ సంవత్సరంలోనూ భారత జట్టు అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌ను గెలిచింది. ఆ సమయంలో ద్రవిడ్ మూడో స్థానంలో బరిలో దిగి తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేయడంతోపాటు, తర్వాతి ఇన్నింగ్స్‌లో 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తనదైన స్థాయి ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇందుకుగాను ద్రవిడ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

ఇద్దరి విషయంలోనూ ఒకటే:

ఇద్దరి విషయంలోనూ ఒకటే:

ద్రవిడ్, ఇప్పుడు పుజారా.. ఇద్దరూ ఒకే(మూడో) స్థానంలో ఆడి జట్టు గెలిచేందుకు దోహదపడ్డారు. ఆసీస్ గడ్డ మీద భారత్ టెస్టు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. 2003 నాటి అడిలైడ్ టెస్టులోనే ఆసీస్ గడ్డపై ద్రవిడ్ తొలి సెంచరీ చేయగా.. ఇప్పుడు పుజారాకు కూడా అదే వేదికగా ఆస్ట్రేలియాలో మొదటి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ద్రవిడ్‌కు అది 16వ టెస్టు సెంచరీ కాగా, పుజారాకు కూడా ఇది 16వ టెస్టు సెంచరీ కావడం ప్రత్యేకం.

Story first published: Monday, December 10, 2018, 15:47 [IST]
Other articles published on Dec 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+