ఆ విషయాల్లో సచిన్, కోహ్లీ ఒకేలా కనిపిస్తారు: రవిశాస్త్రి కితాబు

నాటింగ్‌హామ్: ఐదు టెస్టుల సిరీస్‌లో కోహ్లీసేన తన ఆశలను సజీవంగా ఉంచుకుంది. తొలి రెండు టెస్టుల్లో ఓటములతో ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై 203 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.
సిరిస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆరంభం నుంచే కోహ్లీసేన ఎదురుదాడికి దిగింది. అటు బ్యాట్స్‌మెన్‌తో పాటు ఇటు పేసర్లు పదునైన బంతులు సంధించడంతో ఐదో రోజుకి వికెట్ దూరంలో నిలిచిన టీమిండియా విజయాన్ని కేవలం 17 బంతుల్లోనే ముగించింది.
మొత్తంగా ఇంగ్లాండ్ గడ్డపై భారత్‌కిది ఏడో విజయం కాగా, ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికపై భారత్‌కు ఇది రెండో విజయం కావడం విశేషం. 2007లో ఇదే వేదికపై ఇంగ్లాండ్‌పై ఓసారి గెలిచింది. అంతేకాదు ఇంగ్లాండ్‌పై భారత్‌కు పరుగుల పరం (203)గా ఇది మూడో అతిపెద్ద విజయం కావడం విశేషం.

కోహ్లీకి ఆట అంటే ఎంతో ప్రేమ
మ్యాచ్ అనంతరం టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ "‘కోహ్లీకి ఆట అంటే ఎంతో ప్రేమ. బ్యాటింగ్‌ను ఎంతో ఆస్వాదిస్తాడు. పని నిబద్ధత విషయంలో అతడి తర్వాతే ఎవరైనా. మ్యాచ్‌కు సన్నద్ధం కావడం, ప్రణాళిక రచించుకోవడం, వాస్తవంలో బతకడం.. ఇలాంటి విషయాల్లో సచిన్, కోహ్లీ ఒకేలా కనిపిస్తారు" అని అన్నాడు.

ప్రస్తుత బౌలింగ్ దశం ఎంతో బలంగా
"నాటింగ్‌హామ్‌లో రెండు ఇన్నింగ్స్‌లను కోహ్లీ వెంటనే మరిచిపోతాడు, ఇప్పటిదాకా ఏమీ పరుగులు చేయలేదన్న ఆలోచనతో తర్వాతి మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడు. గతంలో భారత క్రికెట్లోని అత్యుత్తమ బౌలింగ్ దళంతో పోలిస్తే.. ప్రస్తుత బృందం మరెంతో బలంగా ఉంది" అని రవిశాస్త్రి తెలిపాడు.

మేం ఏ జట్టునైనా వారి దేశంలో ఓడించగలం
"మేం ఏ జట్టునైనా వారి దేశంలో ఓడించగలం. కానీ మా దేశంలో మాకు అనుకూలంగా పిచ్‌లు తయారు చేసుకుంటే ప్రత్యర్థులకు అవకాశమే ఉండదు. మేం విదేశాల్లో విజయాలు సాధించి అత్యుత్తమ పర్యాటక జట్టుగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాం" అని శాస్త్రి గర్వంగా చెప్పుకొచ్చాడు.

ఆగస్టు 30న సౌతాంప్టన్ వేదికగా నాలుగో టెస్టు
ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో కెప్టెన్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 97, రెండో ఇన్నింగ్స్‌లో 103 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగో టెస్టు ఆగస్టు 30న సౌతాంప్టన్ వేదికగా ప్రారంభంకానుంది. ఈ సిరిస్‌లో ఇప్పటివరకు మూడు టెస్టులు ముగిశాయి. భారత్ 1-2తో వెనుకంజలో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications