Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2001లో ఇదే రోజు: సెహ్వాగ్‌కు వెరీ స్పెషల్, టెస్టు సెంచరీ

న్యూఢిల్లీ: వీరేంద్ర సెహ్వాగ్. భారత జట్టులో సక్సెస్‌కు మారుపేరు. డాషింగ్ ఓపెనర్‌గా పేరుగాంచిన ఈ ఢిల్లీ నవాబ్ దాదాపు దశాబ్ధానికి పైగా భారత జట్టు క్రికెట్‌కు సేవలందించాడు. అంతేకాదు మూస పద్ధతిలో కొనసాగుతున్న టెస్టు క్రికెట్ ఓపెనర్లకు ఓ చుక్కానిలా నిలిచాడు.

టెస్టులను ఇలాగ కూడా ఆడొచ్చు అంటూ కొత్త భాష్యాన్ని చెప్పాడు. సెహ్వాగ్ క్రీజులో ఉన్నంతసేపు మాత్రమే ఆటను చూసే అభిమానులున్నారంటే సెహ్వాగ్‌కు ఫ్యాన్ క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోండి. టెస్టు క్రికెట్‌లో 300 పరుగులు సాధించిన ఏకైక భారతీయ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు.

తాను సృష్టించిన రికార్డును తిరగరాస్తూ రెండోసారి కూడా ట్రిపుల్ సెంచరీని సాధించిన తొలి భారత క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. 1999లో వన్డేల్లో అరంగేట్రం చేసిన వీరేంద్ర సెహ్వాగ్ 2001 వరకూ టెస్టుల్లో స్థానం సంపాదించలేక పోవడం విశేషం.

మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిసరిగ్గా పదిహేను సంవత్సరాల క్రితం నవంబర్ 3, 2001న సెహ్వాగ్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. శ్రీలంకలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో సెహ్వాగ్ 69 బంతుల్లో సెంచరీ సాధించాడు. దాంతో టెస్టుల్లో అరంగేట్రం చేయాలన్న సెహ్వాగ్ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.

This day, that year: Virender Sehwag's smashing Test debut

అరంగేట్రం చేసిన తొలి టెస్టులోనే దక్షిణాఫ్రికాపై సెహ్వాగ్ సెంచరీ సాధించాడు. 6వ స్ధానంలో బ్యాటింగ్‌కు దిగిన సెహ్వాగ్ నిలకడగా ఆడాడు. తన సహజసిద్ధమైన దూకుడును పక్కకు పెట్టి 173 బంతుల్లో 105 పరుగులు సాధించాడు. ఈ టెస్టు మ్యాచ్‌లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో కలిసి సెహ్వాగ్ 220 పరుగుల భాగస్యామ్యాన్ని నమోదు చేశాడు.

ఈ టెస్టు మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైనప్పటికీ, సెహ్వాగ్ చేసిన తొలి టెస్టు సెంచరీ మాత్రం అతడి కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. అంతేకాదు అరంగేట్రం చేసిన తొలి టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన ఆటగాళ్లలో సెహ్వాగ్ ఒకడిగా నిలిచాడు. ఆ తర్వాత సెహ్వాగ్‌ను ఓపెనర్ గా కొనసాగించాలని ఆనాటి కోచ్ జాన్ రైట్, కెప్టెన్ సౌరవ్ గంగూలీలు భావించారు.

ఈ నిర్ణయంతో 2002లో ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో ఓ సంచలన విజయాన్ని భారత్ నమోదు చేసింది. అటు టెస్టుల్లోనూ, ఇటు వన్డేల్లోనూ ఓపెనర్‌గా సెహ్వాగ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. 82.23 యావరేజితో 2000 పరుగులను అందుకున్న క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. భారత్ తరుపున వన్డేల్లో 15 సెంచరీలు చేసిన సెహ్వాగ్, టెస్టుల్లో 23 సెంచరీలు చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+