Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సరిగ్గా ఇదేరోజు: క్రికెట్‌కు సచిన్ వీడ్కోలు పలికి నాలుగేళ్లు

This day, that year: Sachin Tendulkar retires leaving India misty-eyed

హైదరాబాద్: సచిన్ టెండూల్కర్... క్రికెట్‌ ఉన్నంతకాలం పరిచయం అక్కర్లేని పేరు. భారత క్రికెట్ అభిమానులు ముద్దుగా 'క్రికెట్ గాడ్' అని పిలుచుకునే సచిన్ టెండూల్కర్ నేటితో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికి సరిగ్గా నాలుగేళ్లు అయింది. 24 ఏళ్ల భారత క్రికెట్‌కు తన సేవలందించిన సచిన్ ఇదే రోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో సొంత ప్రేక్షకుల మధ్య నిష్క్రమించాడు.

క్రికెట్ అంటే సచిన్, సచిన్ అంటే క్రికెట్

క్రికెట్ అంటే సచిన్, సచిన్ అంటే క్రికెట్

భారత్‌లో 'క్రికెట్ అంటే సచిన్, సచిన్ అంటే క్రికెట్' అనేంతలా సచిన్ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. అలాంటి సచిన్ రిటైర్మెంట్ అవుతున్నాడంటే మామూలు విషయం కాదు. వాంఖడె స్టేడియంలోని ప్రేక్షకులంతా భావోద్వేగానికి లోనయ్యారు. దేశమొత్తం సచిన్ చివరి మ్యాచ్ చూసేందుకు టీవీలకు అతుక్కొని పోయింది. సచిన్ ఫేర్‌వేల్ మ్యాచ్‌లో భారత్, వెస్టిండిస్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పది వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని సొంతం చేసుకున్న ప్రజ్ఞాన్ ఓజా ఆ అవార్డుని సచిన్‌కు అంకితం చేశాడు. మ్యాచ్ అనంతరం ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి... సచిన్‌ను మాట్లాడాల్సిందిగా కోరాడు.

24 ఏళ్ల నా క్రీడా జీవితం.. 22 గజాల మధ్యే గడిచింది

24 ఏళ్ల నా క్రీడా జీవితం.. 22 గజాల మధ్యే గడిచింది

మ్యాచ్ అనంతరం ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య సచిన్ భావోద్వేగంతో ప్రసంగించాడు. '24 ఏళ్ల నా క్రీడా జీవితం.. 22 గజాల మధ్యే గడిచింది. నా అద్భుత ప్రయాణం ముగిసిందని నమ్మడానికే చాలా కష్టంగా ఉంది. కానీ నా జీవితంలో ముఖ్య పాత్ర పోషించిన వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు చెబుతున్నా. ఎవరినైనా మర్చిపోయే అవకాశం ఉందని.. జీవితంలో తొలిసారిగా లిస్టు రాసుకొచ్చా. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. మాట్లాడటం కాస్త కష్టంగానే ఉంది' అంటూ సచిన్ తన ప్రసంగాన్ని కొనసాగించాడు.

నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి నాన్న

నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి నాన్న

'నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి నాన్న. 1999లో ఆయన నాకు దూరమయ్యారు. ఆయన మార్గదర్శకత్వం లేకుంటే ఈ రోజు నేను మీ ముందు ఇలా నిలబడేవాణ్ని కాదు. 11వ ఏటే ఆయన నాకు స్వేచ్ఛనిచ్చారు. కలల్ని నెరవేర్చుకోమని చెప్పారు. దానికి ఎలాంటి అడ్డదారులు ఉండవని కూడా చెప్పారు. కష్టమైనా ఆయన మాటల్ని తూచ తప్పకుండా పాటించా. ఆయన గుర్తుగా సెంచరీ సాధించిన వెంటనే బ్యాట్‌ను పైకెత్తి ఆకాశం వైపు చూస్తాను' అని సచిన్ చెప్పాడు.

సచిన్, సచిన్ అంటూ మీరు పిలిచే

సచిన్, సచిన్ అంటూ మీరు పిలిచే

తన అల్లరిని అమ్మ భరించడం గురించి, ఇన్నేళ్ల కెరీర్లో తనకెంతో సహకరించిన భార్య పిల్లలు, ఇతర సన్నిహితులు, అభిమానుల గురించి సచిన్ భావోద్వేగంగా చెప్పాడు. 'సచిన్, సచిన్ అంటూ మీరు పిలిచే పిలుపు తుది శ్వాస విడిచే వరకూ నా చెవుల్లో మార్మోగుతుంది. నేనేదైనా చెప్పడం మర్చిపోయినా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. థ్యాంక్యూ వెరీ మచ్ గుడ్ బై' అంటూ సచిన్ తన ప్రసంగాన్ని ముగించాడు. ఈ ప్రసంగం అనంతరం సహచర క్రికెటర్లు సచిన్‌ను భుజాలపై మోసి మైదానం మొత్తం కలియతిరిగారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, November 16, 2017, 15:40 [IST]
Other articles published on Nov 16, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+