న్యూఢిల్లీ: భారత్ క్రికెట్ చరిత్రలో సెప్టెంబర్ 24, 2007కు ఓ ప్రత్యేకత ఉంది. ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 టోర్నమెంట్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఐదు పరుగుల తేడాతో విజయం సాధించి తొలి వరల్డ్ ట్వంటీ20ని గెలుచుకుంది.
ఈ ఫైనల్ మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ 54 బంతుల్లో 75 పరుగులు చేసి స్టార్ బ్యాట్స్‌మెన్‌గా అవతరించగా, రోహిత్ శర్మ 16 బంతుల్లో సాధించిన 30 పరుగులు భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాయి. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి ట్వంటీ20 వరల్డ్ కప్‌ను ప్రవేశపెట్టారు.
దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి ట్వంటీ 20 వరల్డ్ కప్ టోర్నమెంట్ సెప్టెంబర్ 11న ఆరంభమై 14 రోజులు పాటు జరిగింది. ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్‌లో టీమిండియాకు సారధిగా మహేంద్ర సింగ్ ధోని ఉన్నారు.

ధోని నాయకత్వంలోని టీమిండియా తొలిసారి ట్రోఫీని చేజిక్కించుకుంది. దీంతో భారత్‌లో ట్వంటీ 20 మ్యాచ్‌లకు మరింత ఆదరణ లభించింది. కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని కూడా విజయవంతమయ్యాడు.
ఇప్పటివరకూ ఐదు ట్వంటీ20 వరల్డ్ కప్‌లు జరిగాయి. ట్వంటీ 20 వరల్డ్ కప్‌కు తొలిసారి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2016లో జరగనున్న ట్వంటీ 20 వరల్డ్ కప్ ఆరోది. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన ఇర్ఫాన్ పఠాన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును లభించింది.