Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సరిగ్గా ఏడాది క్రితం.. వన్డే ప్రపంచకప్‌లో షమీ మాయ!!

This day last year: Mohammed Shami became 2nd India to take a hat-trick in World Cup

హైదరాబాద్: గతేడాది ఇంగ్లండ్ గడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌లో బ్యాటింగ్ వైఫల్యం కారణంగా టీమిండియా సెమీ ఫైనల్లో నిష్క్రమించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలై ఇంటిదారి పట్టింది. అయితే సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున (జూన్‌ 22) టీమిండియా పేసర్‌ మొహమ్మద్ షమీ ఓ అరుదైన రికార్డు నమోదు చేశాడు. లీగ్ దశలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ సాధించి అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

సౌతాంప్టన్‌ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్‌లో‌ షమీ హ్యాట్రిక్‌ సాధించడంతో టీమిండియా ఊపిరిపీల్చుకుంది. 225 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన అఫ్తాన్‌కు ఆరంభం బాగానే ఉన్నప‍్పటికీ.. మిడిల్‌ ఓవర్లలో మాత్రం వికెట్లను కోల్పోయి ఓటమి పాలైంది. ప్రధానంగా షమీ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో అఫ్గాన్‌ మూడు వికెట్లను వరుసగా కోల్పోయింది.

చివరి ఓవర్‌లో అఫ్గాన్‌ విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు అవసరం. కెప్టెన్ విరాట్ కోహ్లీ బంతిని షమీకి ఇచ్చాడు. అఫ్గానిస్తాన్‌ జట్టు కోసం ఒంటరి పోరాటం చేస్తున్న మహ్మద్‌ నబీ స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. షమీ తొలి బంతిని యార్కర్‌ వేయబోయి ఫుల్‌టాస్‌ వేశాడు. ఆ బంతిని నబీ ఫోర్‌ బాదాడు. దీంతో ఒక్కసారిగా భారత శిబిరంలో ఆందోళన నెలకొంది. మరుసటి బంతిని నబీ డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా షాట్‌ ఆడాడు. సింగిల్‌ వచ్చే అవకాశం ఉన్నా తీయలేదు. ఇక నాలుగు బంతుల్లో 12 పరుగులుగా సమీకరణం మారింది. దీంతో బౌలర్‌ షమీపై ఒత్తిడి పెరిగింది.

అదే సమయంలోనే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన వ్యూహాన్ని అమలు చేశాడు. ధోనీ.. షమీ దగ్గరకు పరుగెత్తుకొచ్చి కొన్ని సూచనలు ఇచ్చాడు. అంనతరం ఫీల్డింగ్‌ మార్చుకున్న షమీ.. యార్కర్‌ సంధించాడు. దీన్ని నబీ లాంగాన్‌ దిశగా భారీ షాట్‌ ఆడగా.. బౌండరీ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న ప్యాండ్యా చేతిలో పడింది. భారత శిబిరంలో ఆనందం వెల్లువిరిసింది. మరుసటి రెండు బంతులను యార్కర్లతో అప్తాబ్‌ అలామ్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌లను క్లీన్‌బౌల్డ్‌ చేసాడు. దీంతో అతడు ఈ ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ తీయడంతో పాటు టీమిండియాకి విజయాన్ని అందించాడు.

ఒక ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ సాధించిన రెండో టీమిండియా బౌలర్‌గా మొహమ్మద్ షమీ రికార్డు సాధించాడు. అంతకుముందు చేతన్‌ శర్మ హ్యాట్రిక్‌ తీశాడు. 1987 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై చేతన్‌ శర్మ హ్యాట్రిక్‌ తీయగా.. అతని సరసన షమీ నిలిచాడు. అది జరిగి ఏడాది కావడంతో దానిని క్రికెట్‌ అభిమానులు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.

Story first published: Monday, June 22, 2020, 20:34 [IST]
Other articles published on Jun 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+