న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

On this day 2005: వన్డే మ్యాచ్‌లో ధోనీ అప్పటి విధ్వంసం

 This day in 2005, MS Dhoni notched up his highest ODI score

హైదరాబాద్: మంచి ఫినిషర్‌గా.. జట్టుకు నాయకుడిగా ఉండి ఎన్నో విజయాలు అందుకున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. భారత్‌కు ఐసీసీ టైటిళ్లన్నీ అందించిన ఏకైక కెప్టెన్. ఇప్పుడైతే ఫామ్‌లో లేడని అభిమానుల నుంచి మాజీ క్రికెటర్లు సైతం ఏకిపారేస్తున్న ధోనీ.. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే రోజు (అక్టోబర్‌ 31 2005) విధ్వంసం సృష్టించాడు.

7 మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో వన్డేలో ధోని

7 మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో వన్డేలో ధోని

క్రికెట్‌ చరిత్రలోనే ఓ కొత్త అధ్యయానికి తెరలేపాడు. శ్రీలంకపై 145 బంతుల్లో 15 ఫోర్లు, 10 సిక్సర్లతో విధ్వంసకరం అంటే ఎంటో ప్రపంచానికి చూపించాడు. అంతకు ముందే వైజాగ్‌ వేదికగా పాకిస్తాన్‌పై 148 పరుగులు చేసి వెలుగులోకి వచ్చిన ధోని శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తన పవరేంటో చాటి చెప్పాడు. 7 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో వన్డేలో ధోని చెలరేగాడు.

శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 298 పరుగులు

శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 298 పరుగులు

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. నాటి ఓపెనర్‌ సచిన్‌ వికెట్‌ను త్వరగా కోల్పోయింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన ధోని.. సెహ్వాగ్‌తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సెహ్వాగ్‌తో 92, ద్రవిడ్‌తో 86, యువరాజ్‌తో 65 పరుగుల భాగస్వామ్యాలు జోడించి ఈ మ్యాచ్‌లో ఒంటి చేత్తో భారత్‌కు విజయాన్నందించాడు.

భారీ ఇన్నింగ్స్‌‌ను గుర్తు చేస్తూ బీసీసీఐ ట్వీట్‌

ఈ విధ్వంసానికి భారత్‌.. నాటి మ్యాచ్‌లో 23 బంతులు మిగిలుండగానే 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇప్పటి వరకు ధోనికి వన్డేల్లో ఇదే అత్యధిక స్కోర్‌ కావడం విశేషం. ఈ భారీ ఇన్నింగ్స్‌‌ను గుర్తు చేస్తూ బీసీసీఐ ట్వీట్‌ చేసింది.

వెస్టిండీస్‌తో జరిగే టీ20సిరీస్‌కు

ఇదిలా ఉంచితే మహేంద్ర సింగ్ ధోనీ కీపింగ్ మినహాయించి జట్టులో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. బ్యాటింగ్‌లో ఏ మాత్రం రాణించకుండా నిరుత్సాహానికి గురి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతని పేలవ ప్రదర్శనకు గాను వెస్టిండీస్‌తో జరిగే టీ20సిరీస్‌కు సైతం అతనిని ఎంపిక చేయలేదు. అలాగే ఆస్ట్రేలియాతో టీ20కు అతనిని దూరంగా ఉంచారు.

Story first published: Wednesday, October 31, 2018, 15:30 [IST]
Other articles published on Oct 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X