Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బర్త్ డే రోజున గోల్డెన్ డక్‌.. ఇంత బ్యాడ్ లక్ ఆర్సీబీ కెప్టెన్‌కే సొంతం!

సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీతో మళ్లీ కలిసిన ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు అనుకున్న ఆరంభం లభించలేదు. అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్‌లో అతను టెక్సాస్ సూపర్ కింగ్స్‌కు డుప్లెసిస్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్ మొదలైన రోజే అతని పుట్టిన రోజు కూడా కావడం గమనార్హం. ఈ క్రమంలో తన బర్త్ డే రోజున తొలి మ్యాచ్ ఆడిన డుప్లెసిస్ తను ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు.

లాస్ ఏంజెలిస్ నైట్ రైడర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్ ఓపెనర్‌గా వచ్చాడు. లోకీ ఫెర్గూసన్ వేసిన ఫుల్ లెంగ్త్ బాల్‌ను కవర్స్ దిశగా పంపేందుకు ప్రయత్నించాడు. అయితే షార్ట్ ఎక్స్‌ట్రా కవర్‌లో ఉన్న ఉన్ముక్త్ చంద్ వైపు ఈ బంతి వెళ్లింది. దీన్ని అతను చాలా సులభంగా పట్టేయడంతో డుప్లెసిస్ ఇన్నింగ్స్ ఖాతా తెరవకుండానే ముగిసింది. ఇలా బర్త్ డే రోజు గోల్డెన్ డకౌట్ అయినా డుప్లెసిస్ చాలా నిరాశగా కనిపించాడు. ఇది చూసిన ఫ్యాన్స్.. ఇంత బ్యాడ్ లక్ కేవలం ఆర్సీబీ కెప్టెన్‌కే సొంతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 Faf du Plesis

అయితే డుప్లెసిస్ ఫెయిలైనా కూడా టెక్సాస్ సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో రాణించింది. ముఖ్యంగా డేవిడ్ మిల్లర్ (61) అద్భుతంగా ఆడాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఎల్ఏ నైట్ రైడర్స్ తడబడ్డారు. ఆండ్రీ రస్సెల్ (55) రాణించినా కూడా మహమ్మద్ మొహ్‌సిన్ నాలుగు వికెట్లతో చెలరేగడంతో నైట్ రైడర్స్ తేరుకోలేకపోయింది.

చివరకు 14 ఓవర్లలో 112 పరుగులకు ఆ టీం ఆలౌట్ అయింది. డుప్లెసిస్ ప్రస్తుతం ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అతను అంతకుముందు తొమ్మిదేళ్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడాడు. ముందుగా 2011 నుంచి 2015 వరకు ఆ టీంకు ఆడిన అతను.. మళ్లీ 2018 నుంచి 2021 వరకు సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి ఆడాడు.

Story first published: Saturday, July 15, 2023, 18:11 [IST]
Other articles published on Jul 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+