కోహ్లీ మీద ప్రేమతో ఖుష్బూ ఏం చేసిందో తెలుసా?
హైదరాబాద్: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటే అభిమానించని భారతీయులు ఉండరు. తన అసమాన బ్యాటింగ్ ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే కోహ్లీకి ఎంత మంది అభిమానులున్నా ఇండోర్‌కు చెందిన ఖుష్బూ అనే అభిమాని తీరే వేరు.
ఎంతలా అంటే కోహ్లీ మీద ప్రేమతో తన పుట్టిన రోజునే మార్చుకుంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఖుష్బూ అనే 16 ఏళ్ల బాలిక తన పుట్టినరోజుని ఎప్పుడో మరిచిపోయింది. అంతేకాదు కోహ్లీ పుట్టినరోజైన నవంబర్ 5నే తన పుట్టిన రోజుని జరుపుకోవడం మొదలుపెట్టింది.

కోహ్లీ అంటే అభిమానం
కోహ్లీ అంటే ఆమెకు ప్రేమ మాత్రమే కాదు చచ్చేంత అభిమానం. రెండు రోజుల కిందటే 16వ పుట్టినరోజు జరుపుకొన్న ఖుష్బూ, ఇప్పటివరకు కోహ్లీకి సంబంధించిన 3000 ఫొటోలకు పైగా సేకరిచింది. అందులో కోహ్లీ చిన్నతనంలో ఉన్న ఫోటోలు కూడా ఉండటం విశేషం.

గర్ల్ ఫ్రెండ్స్‌తో దిగిన ఫోటోలు కూడా
వీటితో పాటు కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టిన తర్వాత సాధించిన సెంచరీలు సందర్భంగా తీసిన ఫోటోలతో పాటు, టాలూలు వేయించుకుని ప్రసార కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలు కూడా ఉన్నాయి. కోహ్లీ తన గర్ల్ ఫ్రెండ్స్‌తో కలిసి దిగిన ఫోటోలు.. ఇలా ఖుష్బూ దగ్గర కోహ్లీకి సంబంధించిన కొన్ని వందల ఫోటోలున్నాయి.

పదో ఏట నుంచే కోహ్లికి అభిమాని
ఈ సందర్భంగా ఖుష్బూ మీడియాతో మాట్లాడింది. 'నా పదో ఏట అనుకుంటా.. ఒక రోజు ఇంట్లో క్రికెట్ మ్యాచ్ చూశా, కోహ్లీ అద్భుతంగా ఆడాడు. ఎందుకో ఆ క్షణమే ఆయనకు అభిమానినైపోయా. అప్పటినుంచి కోహ్లీపై ప్రేమ పెరుగుతూ వచ్చింది. ఆ ఇష్టంతోనే అతనికి సంబంధించిన ఫొటోలు సేకరిస్తా. ఇప్పటిదాకా మూడువేల పైచిలుకు ఫొటోలున్నాయి' అని చెప్పింది.

కోహ్లీ పుట్టిన రోజునే కేక్ కట్ చేస్తున్నా
అసలు తన పుట్టినరోజుని మరిచిపోయానని, కోహ్లీ పుట్టిన రోజునాడే తాను కేక్ కట్ చేస్తున్నానని పేర్కొంది. అమ్మానాన్నలు కూడా తన అభిమానానికి ఏనాడూ అడ్డు చెప్పలేదని తెలిపింది. ఎప్పటికైనా కోహ్లీని కలవాలనేది తన కల అని చెప్పిన ఖుష్బూ, ఇటీవల న్యూజిలాండ్‌తో ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో కోహ్లిని కలిసేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications