INDvsSL: ఈ మ్యాచులో కూడా ఫెయిలైతే.. గిల్ టీ20 కెరీర్ ముగిసినట్లేనా?

శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అత్యంత చెత్తగా ఆడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన రెండు టీ20 మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యాడు. దీంతో అంతకుముందు నుంచి పొట్టి ఫార్మాట్లో అతను పనికి రాడని అంటున్న విశ్లేషకులు అతనిపై దండయాత్ర మొదలు పెట్టారు. అతని బదులు వేరే వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీలంకతో జరిగే మూడో టీ20 అతని కెరీర్‌కు చాలా కీలకం కానుంది.

గిల్ షాట్ సెలెక్షన్‌పై విమర్శలు
శ్రీలంక సిరీస్‌లో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైన గిల్.. చెత్త షాట్లు ఆడి పెవిలియన్‌కు చేరాడు. దీనిపై పలువురు మాజీలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఒకటి రెండు వైఫల్యాలు సహజమే కానీ.. గిల్ అవుటవడం కంటే అతను అవుటైన విధానమే ఎక్కువ విమర్శలకు దారి తీసింది. తొలి టీ20లో మహీష్ తీక్షణ వేసిన బంతిని ఏమాత్రం అంచనా వేయలేకపోయిన గిల్ వికెట్ పారేసుకున్నాడు. ఇక రెండో టీ20లో ఇషాన్ కిషన్ అవుటైన తర్వాత ఇన్నింగ్స్ నిలబెట్టాల్సిన అతను.. పుల్ షాట్ ఆడబోయి అవుటయ్యాడు. ఎలాంటి బంతికి ఎలాంటి షాట్ ఆడాలనే విషయంలో గిల్ ఏమాత్రం సరైన ఆటతీరు కనబర్చలేకపోయాడు.

నిలకడ లేమి
ఫార్మాట్ ఏదైనా గిల్ నిలకడ లేమి అతని కెరీర్‌పై చాలా ప్రభావం చూపింది. భారత్ తరఫున ఇప్పటి వరకు అతను 13 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. ఈ టెస్టుల్లో 32 సగటుతో 736 పరుగులు చేశాడు. గబ్బా వేదికగా 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో 91 పరుగులు చేశాడతను. అయితే ఆ తర్వాత ఆడిన 8 టెస్టుల్లో కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేయగలిగాడు. బంగ్లాదేశ్ సిరీస్‌లో తొలి టెస్టు సెంచరీ చేసినా.. మిగిలిన ఇన్నింగ్స్‌ల్లో ఏమాత్రం రాణించలేదు. ఇక వన్డేల్లో కూడా వెస్టిండీస్, జింబాబ్వేపై మంచి ఇన్నింగ్సులు ఆడిన అతను.. కొంచెం బలమైన జట్లపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

వెయిటింగ్‌లో రుతురాజ్
దేశవాళీల్లో అత్యుత్తమ ఫామ్ కనబరిచిన ముంబై బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్.. అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో గిల్ వరుస వైఫల్యాలు అతనికి కలిసొస్తున్నాయనే చెప్పాలి. గిల్ ఇలాగే విఫలమైతే అతన్ని స్థానాన్ని రుతురాజ్ భర్తీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. విజయ్ హజారే ట్రోఫీలో రుతురాజ్ ఏ రేంజ్‌లో రాణించాడో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. టోర్నీ నాకౌట్ మ్యాచుల్లో వరుసగా సెంచరీలతో ఆకట్టుకున్నాడీ యువ బ్యాటర్. గిల్ ఇలా ఫెయిలవడంతో అతనికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications