న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్‌తో భారత్‌ను పోల్చవద్దు: హర్భజన్

Asia Cup 2018 : Harbhajan Singh Sensational Comments On Pak
 They were playing but not to win: Pakistan no match for India, says Harbhajan Singh

న్యూ ఢిల్లీ: ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్‌ వేదికగా జరుగుతోన్న టోర్నీలో టీమిండియా అదరగొడుతుంది. ముగిసిన అన్ని మ్యాచ్‌లలోనూ ఓటమి అనేది లేకుండా దూసుకుపోతోంది. ప్రత్యేకంగా దాయాది దేశమైన పాకిస్తాన్‌పై రెండు అపురూప విజయాలు సాధించింది. దీంతో రోహిత్‌ సేనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌లను సీనియర్‌ ఆటగాడు, ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ పొగడ్తలతో ముంచెత్తాడు.

'రోహిత్‌ క్లాస్ ఆటగాడు, ధావన్‌ ప్రతిభావంతుడు. బుమ్రా, భువనేశ్వర్‌లు వంటి సమర్థవంతమైన ఆటగాళ్లు ఉండటంతో బౌలింగ్‌ విభాగం కూడా బలంగానే ఉంది. అనుభవం కలిగిన ధోని ఉండటం ప్రధాన బలం. అందుకే ఆసియా కప్‌ గెలిచే అర్హత ఒక్క టీమిండియాకు మాత్రమే ఉంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో టీమిండియాను పోల్చవద్దు.

రెండు జట్ల మధ్య చాలా తేడా ఉంది. పాకిస్తాన్‌ గెలవడానికి ఆడదు.. కేవలం ఆడుతుంది. ఆదివారం మ్యాచ్‌లో టాస్‌ గెలిచి విశ్వాసంతో బ్యాటింగ్‌ ఎంచుకున్నపాక్‌.. మాలిక్‌ మినహా ఎవరూ పోరాడే ప్రయత్నం కూడా ప్రదర్శించలేదు. ప్రసుత పాక్‌ జట్టు టీమిండియాకు పోటీనే కాదు.అంటూ హర్భజన్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఓపెనర్లు సెంచరీలు చేసి విజయం సులభం చేశారన్నారు. ప్రస్తుతం టీమిండియా అన్ని విభాగాల్లో బలంగా ఉందని అభిప్రాయపడ్డారు. మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోని అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందన్నాడు. పాకిస్తాన్‌ జట్టులో షోయబ్‌ మాలిక్‌ మినహా ఎవరూ గొప్పగా రాణించటం లేదని భజ్జీ వివరించాడు.

Story first published: Wednesday, September 26, 2018, 9:54 [IST]
Other articles published on Sep 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X