Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భయమా? అదేంటో కూడా తెలియదు - KS భరత్

అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా శుక్రవారం నుంచి భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్టులో తలపడనుంది. సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తుందనుకున్న టీమిండియాకు తొలి టెస్టులో బిగ్ షాక్ తగిలింది. మొదటి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల ఆధిక్యం లభించి కూడా రోహిత్ సేన పరాజయాన్ని చవిచూసింది. అయితే తొలి టెస్టు ఓటమి అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఏర్పడిన పరిస్థితుల గురించి టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్ మాట్లాడాడు.

మ్యాచ్ ముగిసిన అనంతరం ఎలాంటి ఒత్తిడి, భయానికి గురికాలేదని చాలా రిలాక్స్‌గా ఉన్నామని తెలిపాడు. ఉప్పల్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భరత్ (28; 59 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. అశ్విన్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. భరత్ క్రీజులో ఉన్నంతసేపు టీమిండియా విజయంపై అభిమానుల్లో ఆశలు ఉన్నాయి. కానీ హర్ట్‌లీ బౌలింగ్‌లో భరత్ ఔటైన తర్వాత కాసేపటికే భారత్ ఆలౌటైంది.

They told us not to panic which we are not- KS Bharat

''మ్యాచ్ ముగిసిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్ చాలా ప్రశాంతంగా ఉంది. ఈ ఓటమిని చూసి భయపడొద్దని వారు (ద్రవిడ్, రోహిత్) చెప్పారు. కానీ మేం ఎలాంటి ఆందోళన చెందలేదు. కానీ కొన్ని సూచనలు స్పష్టంగా తెలియజేశారు. ఇది అయిదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ అని, ఇలాంటి సిరీస్‌ల్లో ఎన్నోసార్లు సత్తాచాటామని వివరించారు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలని చెప్పారు. తొలి టెస్టు ముందు రివర్స్ స్వీప్ కూడా సాధన చేశాం. కానీ బ్యాటింగ్ అప్రోచ్ అనేది బ్యాటర్ల వ్యక్తిగత నిర్ణయం. అయితే జట్టు అవసరాలకు తగ్గట్లుగా మేం ఆడతాం'' అని భరత్ పేర్కొన్నాడు.

రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లతో సత్తాచాటిన అరంగేట్ర బౌలర్ టామ్ హర్ట్‌లీ గురించి మాట్లాడుతూ.. ''మేం బౌలర్లను ఎదుర్కోలేదు. బంతుల్ని మాత్రమే ఎదుర్కొన్నాం. అనుభవజ్ఞుడా లేదా అనుభవం లేని వాడా అంటూ క్రికెట్‌లో ఏమీ ఉండదు. సత్తాచాటినప్పుడు మెచ్చుకోవాలి'' అని భరత్ అన్నాడు. కాగా, భరత్ సొంతగడ్డపై రేపు తొలి టెస్టు ఆడనున్నాడు. 30 ఏళ్ల భరత్ వైజాగ్‌కు చెందినవాడు.

ఇంగ్లాండ్ తుది జట్టు:
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హర్ట్‌లీ, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్

భారత జట్టు: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, రజత్ పటిదార్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, కేఎస్ భరత్, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్

Story first published: Thursday, February 1, 2024, 15:25 [IST]
Other articles published on Feb 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+