Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : ఈ ముగ్గురు కుర్రాళ్లకు హ్యాండిచ్చిన సెలెక్టర్లు.. మళ్లీ టీమిండియాకు ఆడతారా?

These Youngsters were not part of INDvsAUS ODI Series team

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న భారత జట్టు.. ఆ తర్వాత జరిగే వన్డే సిరీసులో కూడా రాణించాలని అనుకుంటోంది. ఈ క్రమంలోనే చివరి రెండు టెస్టులతోపాటు, వన్డే సిరీస్ ఆడే జట్టును కూడా సెలెక్టర్లు ప్రకటించేశారు. అయితే కొంతమంది ఆటగాళ్లు సత్తా ఉన్నా కూడా దురదృష్టవశాత్తూ ఈ జట్టులో స్థానం సంపాదించుకోలేకపోయారు. వాళ్లెవరంటే..

రుతురాజ్ గైక్వాడ్

రుతురాజ్ గైక్వాడ్

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆకట్టుకున్న రుతురాజ్ గైక్వాడ్.. ఆ తర్వాత దేశవాళీల్లో కూడా చెలరేగాడు. దీంతో భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. రోహిత్, రాహుల్ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓపెనర్‌గా అతనికే ఛాన్స్ దక్కుతుందని అనుకున్నారు. కానీ మధ్యలో గాయం కావడం, అదే సమయంలో గిల్ అన్ని ఫార్మాట్లలో సత్తా చాటడంతో రుతురాజ్‌ను సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. ఆస్ట్రేలియాతో జరిగే తొలి వన్డేలో రోహిత్ ఆడటం లేదు. అతని బ్యాకప్‌గా రుతురాజ్‌ను ఎంపిక చేయొచ్చు. కానీ గిల్, ఇషాన్ కిషన్ ఉండటంతో అతనిపై సెలెక్టర్లు ఇంట్రస్ట్ చూపించలేదు.

సంజూ శాంసన్

సంజూ శాంసన్

శ్రీలంకతో టీ20 మ్యాచ్ సందర్భంగా గాయపడిన సంజూ శాంసన్‌ను అప్పటి నుంచి సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు. వన్డేల్లో 65 సగటుతో ఉన్న అతన్ని కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు కూడా ఎంపిక చేయలేదు. అలాగే ఆసీస్‌తో జరిగే వన్డేలకు కూడా అతన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ సిరీస్‌లో భారత వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. వీళ్లిద్దరూ అంత గొప్ప ఫామ్‌లో లేని సంగతి తెలిసిందే. అయినా సరే వాళ్లకే అవకాశాలు ఇస్తున్న సెలెక్టర్లు సంజూనే ఎందుకు పక్కన పెడుతున్నారో మాత్రం ఎవరికీ తెలియదు.

అర్షదీప్ సింగ్

అర్షదీప్ సింగ్

ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు ప్రకటించిన జట్టులో అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయం అర్షదీప్ సింగ్ పేరు లేకపోవడమే. ఈ బృందంలో ఆరుగురు పేసర్లకు చోటిచ్చిన సెలెక్టర్లు అర్షదీప్‌కు మాత్రం అవకాశం ఇవ్వలేదు. అదే సమయంలో వెటరన్ పేసర్ జయదేవ్ ఉనద్కత్‌కు ఛాన్స్ ఇచ్చారు. అతను ఉండగా మరో ఎడం చేతి వాటం స్పిన్నర్ ఆడటం కుదరని పనే. రంజీల్లో అద్భుతంగా రాణించడంతోనే ఉనద్కత్‌కు అవకాశం దక్కింది. అయితే టీ20 ఫార్మాట్‌లో భారత్ తరఫున అర్షదీప్ అద్భుతంగా రాణించాడు. మొత్తం 26 మ్యాచులు ఆడిన అతను 41 వికెట్లు తీసుకున్నాడు. అదే సమయంలో వన్డేల్లో మాత్రం పెద్దగా రాణించలేదు. ఇప్పటి వరకు మూడు మ్యాచులు ఆడిన అతను ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. దానికితోడు అతని నోబాల్ సమస్య జట్టుకు పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, February 21, 2023, 22:29 [IST]
Other articles published on Feb 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+