
అర్షదీప్ సింగ్
ఐపీఎల్ ప్రదర్శనలతో టీమిండియాలోకి దూసుకొచ్చిన యువ సంచలనం అర్షదీప్ సింగ్. టీ20 వరల్డ్ కప్‌లో కూడా అతను రాణించాడు. అయితే ఇటీవలి కాలంలో అనవసరంగా నోబాల్స్ వేయడం, భారీగా పరుగులు ఇవ్వడంతో జట్టుకు దూరమయ్యాడు. అయితే మళ్లీ ఐపీఎల్‌లో రాణిస్తే అతను తిరిగి భారత జట్టులోకి రావొచ్చు. స్టార్క్ అంత వేగంగా బౌలింగ్ చేయలేకపోయినా.. తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచులు గెలిపించే సత్తా అర్షదీప్ సింగ్‌కు ఉంది. ఒకానొక సమయంలో జహీర్ ఖాన్ లేని లోటును అర్షదీప్ తీరుస్తాడని నిపుణులు అభిప్రాయపడ్డారు. కాబట్టి ఈ ఐపీఎల్‌లో అర్షదీప్ సింగ్‌పై అందరి చూపూ ఉంటుంది.

మొహ్‌సిన్ ఖాన్
గతేడాది ఐపీఎల్‌లో అందరి దృష్టినీ ఆకర్షించిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మొహ్‌సిన్ ఖాన్. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున 9 మ్యాచులు ఆడిన అతను 14 వికెట్లతో రాణించాడు. స్టార్క్ అంత వేగంగా కాకపోయినా నిలకడగా 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ రెండు వైపులా స్వింగ్ చేయడం అతని స్పెషాల్టీ. ముఖ్యంగా పవర్‌ప్లేలో కత్తుల వంటి బంతులతో వికెట్లు తీస్తాడు. అలాగే స్లోబాల్స్‌తో కూడా బ్యాటర్లను ఇబ్బంది పెడతాడు. అంతకుముందు ముంబై ఇండియన్స్‌తో ఉన్న అతనికి ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత కానీ లక్నో తరఫున మాత్రం చెలరేగాడు. దీంతో భారత జట్టు నుంచి అతనికి పిలుపు రావల్సింది. కానీ గతేడాది అక్టోబరులో భుజం గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు. శస్త్రచికిత్స తర్వాత మళ్లీ ఐపీఎల్ ఆడేందుకు రెడీగా ఉన్నాడు.

ముఖేష్ చౌదరి
ఆడమ్ మిల్నే, దీపక్ చాహర్ వంటి సీనియర్లు లేకపోతే గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ భారం అంతా అరంగేట్ర పేసర్ ముఖేష్ చౌదరిపై పడింది. ఐపీఎల్‌లో తొలి సీజన్ ఆడుతున్న అతను ఈ భారాన్ని మోయడంలో తడబడ్డాడు. మిచెల్ స్టార్క్ స్థాయిలో కాకపోయినా బంతిని బాగా స్వింగ్ చేయడం ముఖేష్ బలం. ఎకానమీ రేటును మెరుగు పరుచుకుంటే అతనికి కూడా టీమిండియా నుంచి పిలుపు రావడం గ్యారంటీ. గతేడాది చెన్నై తరఫున 13 మ్యాచుల్లో 16 వికెట్లు తీసుకున్న అతను.. కొన్ని మ్యాచుల్లో వేసిన స్పెల్స్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అంత బాగా బౌలింగ్ చేశాడీ భిల్వారా పేసర్. ఈ ఏడాది కూడా ఇలాగే ఆకట్టుకుంటే అతన్ని త్వరలోనే బ్లూజెర్సీలో చూడటం ఖాయం.


Click it and Unblock the Notifications
