Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : ఐపీఎల్‌లో ఈ ఏడాది చెలరేగే బౌలర్లు వీళ్లే..!

These top bowlers will dominate in IPL 2023

ఐపీఎల్ పండుగ మరికొన్ని రోజుల్లోనే మొదలవుతోంది. ఈ లీగ్‌లో సత్తా చాటేందుకు ప్రపంచ స్థాయి ఆటగాళ్లంతా ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ 16వ సీజన్‌ను డామినేట్ చేసి, బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టేందుకు చాలా మంది బౌలర్లు రెడీ అవుతున్నారు. వారిలో కేవలం భారత బౌలర్లే కాదు, విదేశీ బౌలర్లూ ఉన్నారు. మరి ఈ సీజన్‌ను డామినేట్ చేసే బౌలర్లు ఎవరో ఒకసారి చూస్తే..

కగిసో రబాడ

కగిసో రబాడ

ఈ సౌతాఫ్రికా పేసర్ ఎంత ప్రమాదకరమైన బౌలరో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పవర్ ప్లే ఓవర్లతోపాటు డెత్ ఓవర్లలో కూడా అలవోకగా వికెట్లు తీసే సత్తా రబాడ సొంతం. గతేడాది 13 మ్యాచులు ఆడిన అతను ఏకంగా 23 వికెట్లతో రాణించాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో కూడా రబాడ చెలరేగాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌ 2023లో కూడా రబాడ చెలరేగే అవకాశం ఉంది.

 యుజ్వేంద్ర చాహల్

యుజ్వేంద్ర చాహల్

టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. ఐపీఎల్ అంటే చాలు రెచ్చిపోతాడు. అంతకుముందు ఆర్సీబీతో ఉన్నప్పుడు కూడా వాళ్ల టాప్ బౌలర్‌గా ఉన్న చాహల్.. గతేడాది రాజస్థాన్ రాయల్స్‌ తరఫున చెలరేగాడు. మొత్తం 17 మ్యాచుల్లో 27 వికెట్లతో సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా చాహల్ అద్భుతంగా రాణిస్తాడని అంతా అనుకుంటున్నారు.

 ఉమ్రాన్ మాలిక్

ఉమ్రాన్ మాలిక్

గతేడాది ఐపీఎల్‌లో భారత్‌కు దొరికిన ఆణిముత్యం ఉమ్రాన్ మాలిక్. తన పేస్‌తో ప్రత్యర్థులను బెంబేలెత్తించే ఉమ్రాన్.. భారత్‌కు కొన్ని మ్యాచులు ఆడిన తర్వాత తన లైన్ అండ్ లెంగ్త్‌పై కూడా ఫోకస్ మొదలు పెట్టాడు. దీంతో ఈ జమ్మూకాశ్మీర్ ఎక్స్‌ప్రెస్‌పై ఈ ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు భారీగా అంచనాలు పెట్టుకుంది. గతేడాది మొత్తం 14 మ్యాచుల్లో 22 వికెట్లతో ఆకట్టుకున్న ఉమ్రాన్.. ఈ ఏడాది అంత కన్నా బాగా రాణిస్తాడని ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు.

 వానిందు హసరంగ

వానిందు హసరంగ

గతేడాది ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన బౌలర్ వానిందు హసరంగ. లీగ్‌లో పర్పుల్ క్యాప్ కోసం చాహల్‌తో ప్రతి మ్యాచ్‌లోనూ పోటీ పడిన ప్లేయర్ హసరంగ. మొత్తం 16 మ్యాచుల్లో 26 వికెట్లతో చెలరేగాడీ శ్రీలంక స్పిన్ మాంత్రికుడు. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో కూడా లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. పరుగులు ఇస్తున్నా వికెట్లు తీయడం హసరంగ స్పెషాల్టీ. అందుకే ఈ ఏడాది కూడా అతను రాణించే అవకాశం ఉంది.

జోఫ్రా ఆర్చర్

జోఫ్రా ఆర్చర్

ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా ఈ ఏడాది ఐపీఎల్‌లో సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. గతేడాది గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన అతను.. ఈ ఏడాది పునరాగమనంలో ఇంగ్లండ్ తరఫున రాణించాడు. బుమ్రా కూడా లేని క్రమంలో ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగం అంతా ఆర్చర్‌పైనే ఎక్కువగా ఆధార పడనుంది. డెత్ ఓవర్లలో బొటన వేళ్లు పగలగొట్టే యార్కర్లు వేసే సత్తా ఉన్న ఆర్చర్.. ఈసారి పర్పుల్ క్యాప్‌ కోసం గట్టిగా పోటీ పడే అవకాశం ఉంది.

Story first published: Tuesday, March 21, 2023, 17:18 [IST]
Other articles published on Mar 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+