INDvsAUS : తొలి వన్డేలో టాప్ స్కోర్ చేసేది వీళ్లే.. భారీ స్కోర్లు గ్యారంటీ!

ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ నెగ్గిన భారత జట్టు అదే జోరులో వన్డే సిరీస్ కూడా తన ఖాతాలో వేసుకోవాలని ఆశగా చూస్తోంది. అదే సమయంలో చివరి రెండు టెస్టుల్లో అద్భుతమైన ఆటతీరు కనబరిచిన ఆసీస్..
వన్డే సిరీస్ నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలని కూడా అనుకుంటోంది. అంతేకాదు. చివరగా భారత్‌లో స్మిత్ కెప్టెన్సీలో ఆసీస్ ఆడినప్పుడు ఆ జట్టు ఘోరంగా ఓడింది. దీనిపై కూడా ప్రతీకారం తీర్చుకోవాలని స్మిత్ సేన గట్టిగా అనుకుంటోంది. ఈ క్రమంలో తొలి వన్డేలో అత్యధిక పరుగులు చేసే ఛాన్స్ ఉన్న ఆటగాళ్లు ఎవరో ఒకసారి చూస్తే..

విరాట్ కోహ్లీ
ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మంచి ఫామ్‌లో ఉన్న టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. తాజాగా అతను టెస్టుల్లో కూడా ఫామ్ అందుకున్నాడు. అహ్మదాబాద్ టెస్టులో అతని ఆట చూస్తే ఎంత మంచి మూడ్‌లో కోహ్లీ ఉన్నాడో అర్థం అయిపోతుంది. దానికితోడు ఈ ఏడాది ఆరంభంలో లంకతో జరిగిన మూడు వన్డేల్లో రెండు సెంచరీలు చేశాడీ మాజీ కెప్టెన్. వన్డేల్లో 13 వేల పరుగుల మైలురాయికి చేరువలో ఉన్న ఈ ఢిల్లీ బ్యాటర్.. ఆస్ట్రేలియాపై ఇప్పటి వరకు 54.71 సగటుతో 2 వేల పరుగులు చేశాడు. తొలి వన్డేలో శ్రేయాస్ అయ్యర్, రోహిత్ శర్మ ఇద్దరూ లేకపోవడంతో ఆ భారం మోయాల్సిన బాధ్యత కోహ్లీపై పడనుంది.

స్టీవ్ స్మిత్
విదేశాల్లో ఆస్ట్రేలియా విజయాల్లో స్టీవ్ స్మిత్ పాత్ర చాలా కీలకం. అద్భుతమైన ఆటతీరుతో మోడ్రన్ క్రికెట్ గ్రేట్‌లలో ఒకడిగా పేరొందిన స్మిత్ ఆటతీరుపైనే ఆస్ట్రేలియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. దానికితోడు భారత్‌లో స్మిత్ వన్డే రికార్డు కూడా చాలా బాగుంది. ఇప్పటి వరకు భారత్‌పై 18 ఇన్నింగ్సుల్లో బ్యాటింగ్ చేసిన అతను 62.38 సగటుతో 1123 పరుగులు చేశాడు. ఈ వన్డేలో కూడా అతను అదే జోరు కొనసాగిస్తే.. భారీ స్కోరు చేయడం గ్యారంటీ అనిపిస్తోంది. దానికితోడు కెప్టెన్సీ వల్ల కూడా అతను బాధ్యతగా ఆడే అవకాశం ఉంది. దీంతో తనే జట్టును ముందుండి నడిపించినా ఆశ్చర్యం లేదు.

శుభ్‌మన్ గిల్
ప్రస్తుతం రెడ్ హాట్ ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లలో శుభ్‌మన్ గిల్ ఒకడు. ఫార్మాట్ ఏదైనా భారీ సెంచరీలు చేసేస్తూ అందరికీ దడపుట్టిస్తున్నాడీ యువ ఓపెనర్. తొలి వన్డేలో రోహిత్ లేకపోవడంతో గిల్, ఇషాన్ ఓపెనర్లుగా వస్తున్నారు. వీళ్లిద్దరిలో కూడా గిల్‌పైనే భారీ అంచనాలు ఉన్నాయి. అహ్మదాబాద్ టెస్టులో కూడా సెంచరీతో రాణించిన అతను ఈ వన్డేలో కూడా రాణిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇటీవల న్యూజిల్యాండ్‌తో జరిగిన వన్డే, టీ20ల్లో కూడా భారీ శతకాలతో ఆకట్టుకున్న గిల్‌పైనే అందరి చూపూ ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications