
డ్వేన్ బ్రావో
చెన్నై సూపర్ కింగ్స్ సాధించిన ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించిన బ్రావో.. తన స్లోబాల్స్‌తో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడతాడు. కానీ అతన్ని మినీ వేలానికి ముందు రిలీజ్ చేస్తున్నట్లు సీఎస్‌కే ప్రకటించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ బ్రావోనే. అతను తన కెరీర్‌లో ఆడిన 161 ఐపీఎల్ మ్యాచుల్లో 183 వికెట్లు తీసుకున్నాడు. అయితే బ్రావో వయసు 39 ఏళ్లు. అందుకే భవిష్యత్తుపై పోకస్ పెట్టిన చెన్నై.. అతన్ని వదులుకుందని సమాచారం. మిగతా ఫ్రాంచైజీలు కూడా అదే ఆలోచనలో ఉంటే బ్రావో మళ్లీ ఐపీఎల్‌లో కనిపించడం కష్టమే.

ఆరోన్ ఫించ్
కొంతకాలంగా ఫామ్‌లో లేక తంటాలు పడుతున్న ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్.. గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అత్యంత చెత్త ప్రదర్శన చేశాడు. ఆడిన ఐదు మ్యాచుల్లో కేవలం 86 పరుగులే చేశాడు. ఇప్పటి వరకు తొమ్మిది జట్ల తరఫున ఆడిన ఫించ్.. ఏ జట్టు తరఫున అద్భుతంగా రాణించిన దాఖలాలు లేవు. దాదాపు ఏడాదిగా ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. దానికితోడు కుటుంబంతో గడపాలనే ఆలోచనతో వచ్చే ఏడాది ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని 35 ఏళ్ల ఫించ్ నిర్ణయించుకున్నాడని సమాచారం. ఈ లెక్కన మళ్లీ అతన్ని ఐపీఎల్‌లో చూడటం దాదాపు అసాధ్యమే.

జేసన్ రాయ్
జేసన్ రాయ్‌ది ఒక స్పెషల్ కేస్. గుజరాత్ టైటాన్స్ జట్టు అంతా అనుకున్నట్లే అతన్ని వదులుకుంది. వేలంలో రూ.2 కోట్లకు అతన్ని గుజరాత్ కొనుగోలు చేసింది. చివరి క్షణంలో బయో బబుల్ వల్ల కుటుంబంతో సమయం గడపలేకపోయానని, వారితో టైం గడపాలని అనుకుంటున్నానని చెప్పి గతేడాది ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడీ డ్యాషింగ్ ఓపెనర్. అంతకుముందు 2020లో కూడా ఇలాగే చివరి క్షణంతో ఐపీఎల్ ఆడటం లేదన్నాడు. ఇలా సాకులు చెప్తూ మూడు ఐపీఎల్ సీజన్లలో కేవలం మూడు మ్యాచులే ఆడాడు. తాజాగా ఇంగ్లండ్ జట్టు కూడా అతనిపై వేటు వేసింది. ప్రస్తుతం అతని వయసు 32 ఏళ్లే కావడంతో మళ్లీ ఫామ్ అందుకొని ఐపీఎల్‌లో కూడా అతను ఆడే అవకాశం ఉంది. కానీ చివరి క్షణంలో లీగ్ నుంచి తప్పుకునే అతని పద్ధతి వల్ల ఫ్రాంచైజీలు వేసుకునే ప్లాన్లన్నీ దెబ్బతింటాయి. కాబట్టి అతన్ని కూడా ఎవరూ ఇకపై కొనుగోలు చేయకపోవచ్చు.


Click it and Unblock the Notifications












