For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsBAN: తొలి టెస్టులో సూపర్ సీన్స్.. సీట్లలో కూర్చోలేకపోయారు..!

These three scenes during INDvsBAN test made buzz among fans

భారత్, బంగ్లాదేశ్ మధ్య టెస్టు మ్యాచ్‌లో ఫ్యాన్స్‌ షాకయ్యే సీన్స్ ఏముంటాయి? అనుకుంటే పొరపాటే. ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచే అందుకు ఉదాహరణ. ఈ మ్యాచ్‌లో కొన్ని సీన్స్ చూసి టీమిండియా ఫ్యాన్స్ సరిగా సీట్లలో కూర్చోలేకపోయారు. ఉత్సాహంతో ఊగిపోయారు. అలాంటివి ముఖ్యంగా మూడు సీన్స్ అందర్నీ అబ్బురపరిచాయి. అవేంటంటే..

వాళ్లు ఒక్క వికెట్ తీయకుండానే..

వాళ్లు ఒక్క వికెట్ తీయకుండానే..

మామూలుగా టెస్టు మ్యాచ్ అంటే బౌలర్లకు కూడా ఎక్కువ వికెట్లు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అదే సమయంలో ఒక తరహా బౌలర్‌కు వికెట్లు పడుతున్నాయంటే కెప్టెన్లు అలాంటి బౌలర్ల చేతనే బౌలింగ్ వేయిస్తారు. అంటే స్పిన్నర్లు వికెట్లు తీస్తుంటే రెండు ఎండ్‌ల నుంచి స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయిస్తారన్నమాట. అయితే బంగ్లా టెస్టులో ఈ సీన్ కనిపించలేదు. రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ ఒక పక్క ఎంత చెమటోడ్చినా ఒక్క వికెట్ కూడా పడలేదు. కానీ కుల్దీప్ యాదవ్‌కు ఏకంగా నాలుగు వికెట్లు పడ్డాయి. ఈ ఇద్దరు ప్రధాన స్పిన్నర్లు వికెట్లేమీ తీయకుండానే బంగ్లా 8 వికెట్లు కోల్పోవడం అభిమానులకు తియ్యని షాకిచ్చింది.

కుల్దీప్ యాదవ్ మేనియా

సాధారణంగా పేసర్లతో పోలిస్తే స్పిన్నర్లు బ్యాటింగ్‌లోనూ కొద్దో గొప్పో జట్టుకు సాయం చేస్తుంటారు. కానీ స్పెషలిస్టు స్పిన్నర్లు బ్యాటుతో ఆకట్టుకోవడం పెద్దగా కనిపించదు. అందుకే వీళ్లను 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దింపుతుంటారు. అలాంటిది ఈ మ్యాచ్‌లో టెయిలెండర్లలో ఉన్న ఉమేష్ యాదవ్ వంటి బిగ్ హిట్టర్‌ను కాదని, కుల్దీప్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపించాడు కెప్టెన్ కేఎల్ రాహుల్. అతను బ్యాటుతో కూడా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత బంతితోనూ అదరగొట్టి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. తను వేసే ప్రతి బంతికీ వికెట్ తీసుకునేలా కనిపించాడీ స్పిన్నర్. దీంతో అభిమానులు అతను ఆడుతుంటే ఉత్సాహంతో ఊగిపోయారు.

లిటాన్ దాస్ వికెట్

లిటాన్ దాస్ వికెట్

బంగ్లాతో తొలి టెస్టు రెండో రోజున భారత అభిమానులకు అత్యంత ఉత్సాహం ఇచ్చిన విషయం మాత్రం లిటాన్ దాస్ అవుటైన సందర్భమే. అంతకుముందు బంతి వేసినప్పుడు సిరాజ్ ఏదో అనడంతో లిటాన్ దాస్ సీరియస్ అయిపోయాడు. ‘ఏంటి? ఏమన్నావ్? నాకు వినపడలేదు. వినిపించేలా మళ్లీ చెప్పు' అంటూ చెవి వద్ద చెయ్యి పెట్టుకుంటూ కొంత ఎక్స్‌ట్రాలు చేశాడు. అయితే ఆ మరుసటి బంతికే దాస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో సిరాజ్ తన సిగ్నేచర్ స్టైల్‌లో నోటిపై వేలు పెట్టుకొని సెలబ్రేట్ చేసుకున్నాడు. అంతకుముందే తమ ఆటగాడితో గొడవకు దిగిన బ్యాటర్.. మరుసటి బంతికే క్లీన్ బౌల్డ్ అయితే అభిమానులు సైలెంట్‌గా ఎందుకుంటారు? స్టేడియం మొత్తం దద్దరిల్లేలా అరుస్తూ తాము కూడా సెలబ్రేట్ చేసుకున్నారు.

Story first published: Friday, December 16, 2022, 8:05 [IST]
Other articles published on Dec 16, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+