Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : అరుదైన రికార్డులకు అడుగు దూరంలో.. కోహ్లీ, రోహిత్ సాధిస్తారా?

These three records will be broken in the third test

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టు చాలా పేలవంగా ఆడుతోంది. అయితే తొలి రెండు టెస్టుల్లో ఘోరంగా ఓడిన ఈ జట్టు మూడో టెస్టులో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. స్టార్క్, గ్రీన్ వంటి కీలక ఆటగాళ్లు కూడా జట్టుతో చేరడం ఆసీస్‌కు కలిసొచ్చేలా ఉంది. ఈ క్రమంలో మూడో టెస్టులో కొన్ని రికార్డులు బద్దలయ్యేలా కనిపిస్తోంది. అవేంటో ఒకసారి పరిశీలిస్తే..

ఒక్కటి పట్టేస్తే చాలు..

ఒక్కటి పట్టేస్తే చాలు..

టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ కేవలం బ్యాటుతోనే కాదు, ఫీల్డింగ్‌లోనూ అద్భుతమైన సత్తా చూపిస్తాడనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో బెస్ట్ స్లిప్ ఫీల్డర్లలో కోహ్లీ ఒకడు. ఇటీవలి కాలంలో స్లిప్స్‌లో కూడా కోహ్లీ కొంత తడబడుతున్న మాట వాస్తవమే. కానీ ఇప్పటికీ భారత జట్టులో బెస్ట్ ఫీల్డర్లలో కోహ్లీ ఒకడనేది కాదనలేని సత్యం. ఈ క్రమంలోనే అతను అరుదైన రికార్డుకు అడుగు దూరంలో నిలిచాడు. భారత్ తరఫున 300 క్యాచులు పట్టిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పేందుకు ఒక్క క్యాచ్ దూరంలో ఉన్నాడు. ఇప్పటికి కోహ్లీ మొత్తం 299 క్యాచులు పట్టాడు. మూడో టెస్టులో కనుక అతను ఒక్క క్యాచ్ పట్టినా.. భారత్ తరఫున 300 క్యాచులు పట్టిన మూడో ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. అతని కన్నా ముందు ఈ జాబితాలో ఎంఎస్ ధోనీ, రాహుల్ ద్రావిడ్ ఉన్నారు.

ఇండోర్ అంటూ పూనకాలే?

ఇండోర్ అంటూ పూనకాలే?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో మూడో టెస్టులో కూడా అతను అరుదైన ఘనత సాధించే అవకాశం ఉంది. ఇండోర్ పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తుందనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో తొలి టెస్టులో చేసినట్లే ఇక్కడ కూడా రోహిత్ సెంచరీ చేస్తే అదొక అరుదైన రికార్డును అతని పేరిట రాసేస్తుంది. ఇక స్టేడియంలో అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఏకైక భారత ఆటగాడిగా రోహిత్ నిలుస్తాడు. గతంలో ఇక్కడ శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో సెంచరీ బాదిన రోహిత్.. ఇటీవలే కివీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో కూడా సెంచరీ చేశాడు. ఇప్పుడు టెస్టులో కూడా మూడంకెల స్కోరు అందుకుంటే.. ఒకే స్టేడియంలో మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారతీయ బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు.

వరుసగా నాలుగోసారి..

వరుసగా నాలుగోసారి..

ఇండోర్ టెస్టులో కనుక టీమిండియా విజయం సాధిస్తే.. వరుసగా నాలుగోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నెగ్గిన తొలి జట్టుగా భారత్ నిలుస్తుంది. ఈ సిరీస్ ప్రారంభమైన తర్వాత ఒక్కసారి కూడా ఇలా నాలుగు సార్లు ఒకే జట్టు విజేతగా నిలవలేదు. ఈ ఏడాది భారత్‌లో జరుగుతున్న సిరీసులో తొలి రెండు మ్యాచుల్లో విజేతగా నిలిచిన భారత్ సిరీసును రిటైన్ చేసుకుంది. అయితే మూడో మ్యాచు కూడా గెలిస్తే ఇది భారత్ వశం అవుతుంది. ఇదే జరిగితే వరుసగా నాలుగు సార్లు ఈ సిరీస్ గెలిచిన జట్టుగా టీమిండియా అరుదైన ఘనత సాధిస్తుంది. 2016-17, 2018-19, 2020-21 సంవత్సరాల్లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా భారత్ నెగ్గిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, March 1, 2023, 8:54 [IST]
Other articles published on Mar 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+