INDvsBAN: బంగ్లా టెస్టులో మూడు కీలక రికార్డులు బద్దలు.. రోహిత్‌ను దాటేసిన పుజారా..!

బంగ్లాతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో భారత జట్టు 1-0 ఆధిక్యం సాధించింది. చట్టోగ్రాం వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టును 188 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఛటేశ్వర్ పుజారా (90), శ్రేయాస్ అయ్యర్ (86), రవిచంద్రన్ అశ్విన్ (58) ముగ్గురూ హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత జట్టు 404 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేజింగ్‌లో కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లతో చెలరేగడంత బంగ్లా 150 పరుగులకే కుప్పకూలింది.
రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (110), ఛటేశ్వర్ పుజారా (102 నాటౌట్) మూడంకెల స్కోరు సాధించారు. ఆ తర్వాత 513 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాను భారత బౌలర్లు 324 పరుగులకు ఆలౌట్ చేశారు. ఈ మ్యాచ్‌లో కొన్ని కీలక రికార్డులు బద్దలయ్యాయి. అవేంటో ఒకసారి చూస్తే..
అదరగొట్టిన బంగ్లా ఓపెనర్లు
ఆసియాలో క్రికెట్ ఆడే దేశాల్లో భారత జట్టు టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ జట్లలో ఒకటిగా టీమిండియాను ఎందరో పొగుడ్తున్నారు. అలాంటి భారత జట్టుపై బంగ్లా ఓపెనర్లు అద్భుతంగా ఆడారు. రెండో ఇన్నింగ్స్ సందర్భంగా నజ్ముల్ షాంటో (67), జాకిర్ హసన్ (100) తొలి వికెట్‌కు 124 పరుగులు జత చేశారు. మరే ఆసియా జట్టు కూడా నాలుగో ఇన్నింగ్సులో బ్యాటింగ్ చేస్తూ భారత్‌పై తొలి వికెట్‌కు ఇంత స్కోరు చెయ్యలేదు. ఈ మ్యాచులోనే అరంగేట్రం చేసిన జాకిర్ హసన్ సెంచరీ కూడా చేయడం గమనార్హం.
బంగ్లాపై కుల్దీప్ పంజా
ఒక విధంగా తొలి టెస్టులో బంగ్లా ఓడిపోవడానికి కారణం కుల్దీప్ యాదవే. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్‌తో కలిసి 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అతను.. బంతితోనూ రాణించి ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చివరి ఇన్నింగ్స్‌లో కూడా మూడు కీలక వికెట్లు తీసి బంగ్లాను దెబ్బతీశాడు. ఈ మ్యాచులో మొత్తం 113 పరుగులు ఇచ్చి 8 వికెట్లు తీసుకున్నాడు. ఇది బంగ్లాపై భారత్ తరఫున ఒక స్పిన్ బౌలర్ చేసిన అత్యుత్తమ ప్రదర్శన. ఇంతకుముందు ఈ రికార్డు సునీల్ జోషి (8/169) పేరిట ఉండేది.
ఆగయారే పుజారా
బంగ్లాతో తొలి టెస్టులో భారత్ తరఫున అత్యుత్తమ బ్యాటర్ ఎవరు? అంటే చటుక్కున చెప్పే పేరు ఛటేశ్వర్ పుజారా. రెండు ఇన్నింగ్సులలో కలిపి అతను 192 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే 52 ఇన్నింగ్సుల తర్వాత మళ్లీ సెంచరీల బాట పట్టాడు. అంతేకాదు, ఈ మ్యాచులో పుజారా మరో రికార్డు కూడా అందుకున్నాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. గత డబ్ల్యూటీసీ, ఈ డబ్ల్యూటీసీ సైకిల్స్ రెండింట్లో కలిపి మొత్తం 29 మ్యాచులు ఆడిన పుజారా 1558 పరుగులు చేశాడు. దీంతో రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. రోహిత్ ఈ టోర్నీల్లో 18 మ్యాచులు ఆడి 1507 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications