Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : ధోనీ రిటైర్ అయితే.. చెన్నైలో ఆ పాత్ర పోషించగలిగే ముగ్గురు స్టార్లు వీళ్లు!

These three players who can fill Dhoni shoes in CSK after his retirement

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. నాలుగు సార్లు ఈ ట్రోఫీ ముద్దాడిన చెన్నై జట్టు.. ఆరంభం నుంచి కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ చేతుల్లోనే ఉంది. గతేడాది ఆరంభంలో రవీంద్ర జడేజాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించినా.. అతను విఫలం అవడంతో మరోసారి ధోనీ చేతికే పగ్గాలు అందించాల్సి వచ్చింది.

ధోనీ రిటైర్ అయితే..

ధోనీ రిటైర్ అయితే..

అయితే వచ్చే ఏడాది ఐపీఎల్ తర్వాత ధోనీ పూర్తిగా క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే 41 ఏళ్ల ధోనీ.. మరో ఐపీఎల్ ఆడటం అసాధ్యంగానే కనిపిస్తోంది. దీంతో భవిష్యత్తులో సీఎస్‌కేలో ధోనీ పాత్రను ఎవరు పోషిస్తారనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్ చేసే అవకాశం కనిపిస్తోంది. దేశవాళీల్లో అతను మహారాష్ట్ర కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే రుతురాజ్ మరీ యువకుడు అనుకుంటే కెప్టెన్ కోసం వేలంలో వెతుక్కోక తప్పదు. ఈ క్రమంలో ధోనీ పాత్రకు సరిపోయే ముగ్గురు ఆటగాళ్లు కనిపిస్తున్నారు.

బెన్ స్టోక్స్..

బెన్ స్టోక్స్..

ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌పై ప్రస్తుతం అన్ని ఫ్రాంచైజీలు ఫోకస్ పెట్టాయి. వన్డేలకు ఇటీవలే వీడ్కోలు పలికిన ఈ స్టార్ ప్లేయర్.. టీ20 ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. టోర్నీలో ఇంగ్లండ్ తప్పక గెలవాల్సిన మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. జట్టును ముందుండి నడిపించడానికి ఇష్టపడే స్టోక్స్.. ఇంగ్లండ్ టెస్టు జట్టును ఎలా మార్చేశాడో అందరికీ తెలిసిందే. కాబట్టి అతన్ని కొనుగోలు చేసి చెన్నై జట్టును అతని చేతుల్లో పెడితే.. ధోనీలాగే జట్టును ముందుకు తీసుకెళ్లగలడు.

 జేసన్ హోల్డర్

జేసన్ హోల్డర్

అత్యంత చిన్న వయసులోనే వెస్టిండీస్ సారధిగా బాధ్యతలు చేపట్టి.. బడా బడా స్టార్లు లేని జట్టుతో కూడా డీసెంట్ ప్రదర్శన చేసిన కెప్టెన్ జేసన్ హోల్డర్. లక్నో తరఫున గతేడాది ఫర్వాలేదన్నట్లు రాణించాడు. కీలకమైన సమయాల్లో వికెట్లు తీయడంతోపాటు పించ్ హిట్టింగ్ చేయడం హోల్డర్ స్పెషాలిటీ. మైదానంలో ఎంత టెన్షన్ ఉన్నా ప్రశాంతంగా ఉండే అతన్ని చెన్నై సారధిగా నియమించినా ధోనీ పాత్రను పోషించే అవకాశం ఉంది. అయితే ధోనీ రేంజ్‌లో హోల్డర్ రాణిస్తాడా? అనేది ప్రశ్న.

డ్వేన్ బ్రావో

డ్వేన్ బ్రావో

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని టీ20 లీగుల్లో రాణించిన డ్వేన్ బ్రావో.. చాలా ఏళ్లుగా చెన్నైతో కలిసి ఉన్నాడు. ఇతను కూడా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కావడం గమనార్హం. ధోనీకి మంచి స్నేహితుడైన తను కూడా తన చుట్టూ జట్టును నిర్మించగల సమర్థుడే. మెగావేలానికి ముందు అతన్ని రిలీజ్ చేసిన చెన్నై.. రూ.4.4 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది. ఈసారి కూడా అతన్ని వదిలేసినా మళ్లీ వేలంలో కొనుగోలు చేసి కెప్టెన్ చేసే అవకాశం ఉంది. అయితే 39 ఏళ్ల వయసు ఉండటం బ్రావో మైనస్. కానీ రుతురాజ్‌ను కెప్టెన్‌గా మలిచేందుకు కొంత సమయం కావాలని అనుకుంటే మాత్రం బ్రావోనే బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తున్నాడు.

Story first published: Friday, November 18, 2022, 15:48 [IST]
Other articles published on Nov 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+