Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అర్హత లేకున్నా ఆసియా క్రీడలకు.. లక్కీగా ఛాన్స్ కొట్టేసిన ముగ్గురు ప్లేయర్స్!

వన్డే వరల్డ్ కప్ జరిగే సమయంలోనే ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఈసారి ఏషియన్ గేమ్స్‌లో క్రికెట్ కూడా ఉంది. ఈ క్రమంలోనే భారత ఆటగాళ్లను కూడా ఆసియా క్రీడలకు పంపాలని బీసీసీఐ డిసైడ్ అయింది. అయితే ఈ టోర్నీకి వెళ్లే టీంలో కొంత మంది ప్లేయర్లు అదృష్టంతో చోటు సంపాదించారు. ఎందుకంటే ప్రస్తుతం వీళ్లు అంత గొప్ప ఫామ్‌లో లేరు. వాళ్లు ఎవరంటే..

ముఖేష్ కుమార్: దేశవాళీల్లో ఎర్రబంతితో చెలరేగిన ప్లేయర్ ముఖేష్ కుమార్. ఇటీవలి కాలంలో ఏ ఫార్మాట్‌లో భారత జట్టును ప్రకటించినా ఇతనికి అవకాశం దక్కుతోంది. కానీ వైట్ బాల్ క్రికెట్‌లో ముఖేష్ కుమార్ ఒక్కసారి కూడా సత్తా చాటలేదు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో 33 మ్యాచులు ఆడిన అతను 32 వికెట్లు తీసుకున్నాడు. ముఖేష్ బౌలింగ్‌లో పెద్దగా వేరియేషన్స్ లేకపోవడం అతనికి పెద్ద సమస్యగా మారింది.

Three players are not in-form. But luckily selected to play in Asia Games

షాబాజ్ అహ్మద్: టీమిండియా ఆల్‌రౌండర్స్ అనగానే రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ గుర్తొస్తారు. వాళ్ల అడుగు జాడల్లోనే నడుస్తున్న మరో ఎడం చేతి వాటం స్పిన్నర్ షాబాజ్ అహ్మద్. అయిే ఇతను కూడా టీ20ల్లో పెద్దగా సత్తా చాటలేదు. ఇప్పటి వరకు 72 టీ20లు ఆడిన అతను కేవలం రెండు హాఫ్ సెంచరీలచే చేశాడు. అలాగే 47 వికెట్లు మాత్రమే తీసుకోగలిగాడు. ఈ ఏడాది ఆర్సీబీ తరఫున చెత్త ప్రదర్శన చేయడంతో అతన్ని జట్టులో నుంచి కూడా తీసేయడం గమనార్హం.

ఆవేష్ ఖాన్: ఆసియా క్రీడలకు ప్రకటించిన జట్టులో భారత్ నలుగురు పేసర్లను ఎంపిక చేసింది. పంజాబ్ పేసర్ అర్షదీప్ సింగ్ ఈ పేస్ దళానికి నాయకత్వం వహించనున్నాడు. అతనితోపాటు మరో కీలక పేసర్‌గా ఆవేష్ ఖాన్‌ను ఎంపిక చేశారు. అయితే ఇటీవలి కాలంలో ఆవేష్ ఖాన్ చాలా ఘోరమైన ప్రదర్శన చేయడం గమనార్హం. ఈ ఏడాది ఐపీఎల్‌లో కూడా ఆవేష్ రాణించలేదు. అంతర్జాతీయ స్థాయిలో 15 టీ20లు ఆడిన అతను కేవలం 13 వికెట్లు మాత్రమే తీయడం గమనార్హం.

Story first published: Tuesday, July 18, 2023, 20:53 [IST]
Other articles published on Jul 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+