Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: ఈ ముగ్గురు ప్లేయర్లు ఘోరంగా ఫెయిల్.. అయినా కావాలంటున్న ఐపీఎల్ టీమ్స్?

These three players got retained even after failing in last IPL

ఐపీఎల్ వంటి లీగుల్లో ఆటగాళ్ల సత్తా మీదనే వారి భవితవ్యం ఆధారపడి ఉంటుంది. యువ ఆటగాళ్లు ఈ లీగ్‌లో తమను తాము నిరూపించుకుంటే కచ్చితంగా జాతీయ జట్టులో చోటు లభిస్తుందని ఫ్యాన్స్ నమ్ముతారు. అలాంటిది ఒక సీజన్ మొత్తం ఏమాత్రం ప్రభావం చూపకపోతే పరిస్థితి ఏంటి? వాళ్లను ఆ జట్లే వదిలేస్తాయి అనుకుంటే పొరపాటే. గతేడాది ఐపీఎల్‌లో రాణించకపోయినా కొంత మందిని మాత్రం ఆ ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్నాయి. ఆ అదృష్టవంతులు ఎవరంటే..

 మాథ్యూ వేడ్

మాథ్యూ వేడ్

గతేడాది టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ ఇన్నింగ్స్ అద్భుతమే అని చెప్పాలి. ఆ మ్యాచ్‌లో జట్టును అతనే గెలిపించాడు. దీంతో భారీ అంచనాలతో అతన్ని గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. కానీ ఐపీఎల్‌లో ఓపెనర్‌గా వచ్చిన అతను ఏమాత్రం రాణించలేదు. పది మ్యాచులు ఆడినా కూడా కేవలం 157 పరుగులు మాత్రమే చేశాడు. అతని కన్నా టెస్టు స్పెషలిస్ట్ వృద్ధిమాన్ సాహా అదరగొట్టాడు. అయినా సరే వేడ్‌ను గుజరాత్ జట్టు రిటైన్ చేసుకోవడం గమనార్హం.

షారుఖ్ ఖాన్

షారుఖ్ ఖాన్

దేశవాళీల్లో తమిళనాడు తరఫున అదరగొట్టాడనే కారణంతో షారుఖ్ ఖాన్‌ను ఏకంగా రూ.9 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్ యాజమాన్యం. కానీ తన ధరకు ఏమాత్రం న్యాయం చెయ్యలేకపోయిన షారుఖ్.. గతేడాది ఐపీఎల్‌లో 8 మ్యాచులు ఆడి కేవలం 117 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయినా అతన్ని వదులుకోవడానికి పంజాబ్ ఇష్టపడలేదు. వచ్చే ఏడాదికి అతన్ని రిటైన్ చేసుకుంది.

రియాన్ పరాగ్

రియాన్ పరాగ్

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫినిషర్‌గా తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్న యువ క్రికెటర్ రియాన్ పరాగ్. గత సీజన్ మొత్తం ఆడిన అతను.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే హాఫ్ సెంచరీ సాధించాడు. మొత్తం 17 మ్యాచులు ఆడినప్పటికీ కేవలం 183 పరుగులు మాత్రమే చెయ్యగలిగాడు. అయినా అతనిపై నమ్మకం ఉంచిన రాజస్థాన్ జట్టు.. పరాగ్‌ను రిటైన్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. తన కెరీర్‌లో 47 ఐపీఎల్ మ్యాచుల్లో 16.84 సగటు, 124.88 స్ట్రైక్ రేట్‌తో 522 పరుగులు చేశాడీ 21 ఏళ్ల ఫినిషర్. ఇంత ఘోరమైన రికార్డు ఉన్న ప్లేయర్‌ను రిటైన్ చేసుకున్నారంటే కచ్చితంగా నక్కతోక తొక్కి ఉండాల్సిందే అని ఫ్యాన్స్ అంటున్నారు.

Story first published: Wednesday, November 16, 2022, 19:01 [IST]
Other articles published on Nov 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+